ఏపీలో 363కు చేరిన కరోనా కేసులు…ఆరుగురి మృతి 

10TV Telugu News

ఏపీలో కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. అనంతపురంలో ఒకరు, గుంటూరులో మరొకరు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనాతో మొత్తం ఆరుగురు మరణించారు. ఇవాళ కొత్తగా 15 కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో కరోనా కేసులు పాజిటివ్ 363 కు చేరాయి. గురువారం ప్రకాశం జిల్లాలో అధికంగా 11 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లాలో 2, తూర్పుగోదావరి, కడపలో ఒక్కో కేసు చొప్పున నమోదు అయ్యాయి. 

అత్యధికంగా కర్నూలు 75 కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లాలో 51, నెల్లూరులో 48, కృష్ణా జిల్లాలో 35, ప్రకాశం జిల్లాలో 38, కడప జిల్లాలో 29, పశ్చిమ గోదావరి జిల్లాలో 22 కేసులు నమోదు అయ్యాయి. చిత్తూరు జిల్లాలో 20, విశాఖపట్నం జిల్లాలో 20, అనంతపురం జిల్లాలో 13, తూర్పుగోదావరి జిల్లాలో 12 కేసులు నమోదు అయ్యాయి.

రాష్ట్రంలో రోజుకు రోజుకూ కోవిడ్ 19 కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా పెరగుతోంది. ఆ తర్వాత ప్రకాశం జిల్లాలో కూడా కేసుల సంఖ్య పెరుగుతోంది. నిన్నటి వరకు 27 కేసులుగా ప్రకటించగా..తాజాగా పెరిగిన 11 కేసులతో మొత్తం 38 కేసులు నమోదు అయ్యాయి. 

Also Read | లాక్ డౌన్ ఒక్కటే కరోనా నివారిణి కాదు

10TV Telugu News