ఏపీలో 44కు చేరిన కరోనా కేసులు..ఇవాళ ఒక్కరోజే 21 మందికి పాజిటివ్‌ 

ఏపీలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 44కు చేరాయి. ఇవాళ ఒక్కరోజే ఏపీలో 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

  • Published By: veegamteam ,Published On : March 31, 2020 / 06:12 PM IST
ఏపీలో 44కు చేరిన కరోనా కేసులు..ఇవాళ ఒక్కరోజే 21 మందికి పాజిటివ్‌ 

ఏపీలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 44కు చేరాయి. ఇవాళ ఒక్కరోజే ఏపీలో 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రాష్ట్రంలో రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఏపీలో మరో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 44కు చేరాయి. ఇవాళ ఒక్కరోజే ఏపీలో 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 21 కరోనా కేసుల్లో 18 కేసుల్లో మర్కజ్‌ సదస్సుకు వెళ్లివచ్చినవారే ఉన్నారు. విశాఖలో ఇవాళ ఒక్కరోజే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నలుగురు మర్కజ్‌ సదస్సులో పాల్గొన్నవారిగా గుర్తించారు. 

ఈ మేరకు మంగళవారం (మార్చి 31, 2020) రాష్ట్ర నోడల్‌ అధికారి ఒక ప్రకటన విడుదల చేశారు. సోమవారం రాత్రి 9 గంటల తర్వాత మొత్తం 256 శాంపిళ్లను పరీక్షించగా 21 కరోనా పాజిటివ్‌, 235 కరోనా నెగిటివ్‌గా తేలాయని వెల్లడించారు. ఇప్పటివరకు ఇద్దరు కోలుకున్నట్టు చెప్పారు.

బాధితుల్లో ఢిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. తాజాగా పదేళ్ల బాలుడికి కరోనా సోకినట్టు తేలడం కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లా హిందూపురంకి చెందిన బాలుడి కరోనా పాజిటివ్ వచ్చింది.

నిన్నటి వరకు ఏపీలో కరోనా కేసుల సంఖ్య 23. ఆ సంఖ్య కాస్త ఒక్కసారిగా 40కి పెరగడం అందరిని ఆందోళనకు గురి చేస్తోంది. అటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కరోనా కట్టడికి మరిన్ని చర్యలు చేపట్టింది. లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేసే యోచనలో ఉంది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 11 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్రంలోని ప్రకాశం – 11, విశాఖపట్నం – 10, గుంటూరు -9, కృష్ణా -5, తూర్పు గోదావరి -4, అనంతపురం-2, చిత్తూరు -1, నెల్లూరు -1, కర్నూలు-1 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆస్పత్రులలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు.   

Also Read | భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోవడం బాధగా ఉంది… కానీ లాక్‌డౌన్‌ చాలా ముఖ్యం : మంచు విష్ణు