కరోనా ఎఫెక్ట్ : విదేశాల నుంచి వైజాగ్ చేరుకున్న 186 మంది విద్యార్థులు

హమ్మయ్య ఎట్టకేలకు స్టూడెంట్స్ విశాఖలో ల్యాండ్ అయ్యారు. కరోనా ఎఫెక్ట్ తో తీవ్ర ఇబ్బందులు పడిన విద్యార్థులు వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

  • Edited By: veegamteam , March 18, 2020 / 02:59 PM IST
కరోనా ఎఫెక్ట్ : విదేశాల నుంచి వైజాగ్ చేరుకున్న 186 మంది విద్యార్థులు

హమ్మయ్య ఎట్టకేలకు స్టూడెంట్స్ విశాఖలో ల్యాండ్ అయ్యారు. కరోనా ఎఫెక్ట్ తో తీవ్ర ఇబ్బందులు పడిన విద్యార్థులు వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

హమ్మయ్య ఎట్టకేలకు స్టూడెంట్స్ విశాఖలో ల్యాండ్ అయ్యారు. కరోనా ఎఫెక్ట్ తో తీవ్ర ఇబ్బందులు పడిన విద్యార్థులు వైజాగ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కౌలాలంపూర్ ఫ్లైట్ విశాఖకు చేరుకుంది. మలేషియా, సింగపూర్, ఫిలిఫ్పైన్స్ నుంచి 186 మంది విద్యార్థులు వైజాగ్ చేరుకున్నారు. ఏ-320 ఎయిర్ ఏషియా విమానంలో వచ్చారు. విద్యార్థులు వైజాగ్ కు రావడంతో వారి తల్లిదండ్రులు ఊపరి పీల్చుకున్నారు. ఈ మేరకు వారికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. ఎయిర్ పోర్టుకు చేరుకున్న విద్యార్థులను క్వారంటైన్ కు తరలిస్తారు. 

మొత్తం మూడు క్యాటగిరిల్లో విద్యార్థులకు టెస్టులు నిర్వహిస్తారు. స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు వైద్య బృందం సిద్ధంగా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసిస్తున్న 186 విద్యార్థులు వైజాగ్ కు చేరుకున్నారు. విద్యార్థులను ఏ, బీ, సీ క్యాటగిరీలుగా విభజిస్తారు. సీ క్యాటగిరి విద్యార్థులను కూడా అబ్జర్వేషన్లలో ఉంచి, టెస్టులు నిర్వహించిన తర్వాతనే ఇంటికి పంపిస్తామని అధికారులు చెబుతున్నారు. 14 రోజుల తర్వాతనే ఇంటికి పంపిస్తామంటున్న అధికారులు. 

ఏపీ, తెలంగాణనే కాదు వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను వైజాగ్ కు వచ్చారు. ఆయా రాష్ట్రాల అధికారులకు సమాచారం అందిస్తామని చెప్పారు. వీరిలో తెలంగాణ, కేరళకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి విద్యార్థిని కూడా ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్ లు సిద్ధంగా ఉన్నాయన్నారు. క్వారంటైన్ లు, అన్ని టెస్టులు నిర్వహించి వైరస్ సోకలేదని నిర్ధారించిన తర్వాతనే వారిని పేరెంట్స్ దగ్గరకు పంపుతామని అధికారులు అన్నారు.