ఏపీలో రెండుకి చేరిన కరోనా కేసులు, ఒంగోలు యువకుడికి కొవిడ్ వైరస్, గుంటూరులోనూ కలకలం

ఏపీలోని గుంటూరు జిల్లాలో రెండు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. మంగళగిరిలో దంపతులకు కరోనా లక్షణాలు కనిపించాయి. నిన్న(మార్చి 18,2020) అమెరికా

  • Published By: veegamteam ,Published On : March 19, 2020 / 06:47 AM IST
ఏపీలో రెండుకి చేరిన కరోనా కేసులు, ఒంగోలు యువకుడికి కొవిడ్ వైరస్, గుంటూరులోనూ కలకలం

ఏపీలోని గుంటూరు జిల్లాలో రెండు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. మంగళగిరిలో దంపతులకు కరోనా లక్షణాలు కనిపించాయి. నిన్న(మార్చి 18,2020) అమెరికా

ఏపీలోనూ కరోనా కలకలం రేగింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రెండుకి పెరిగింది. ఒంగోలు యువకుడికి కరోనా సోకినట్టు అధికారులు నిర్ధారించారు. ఇప్పటికే నెల్లూరుకి చెందిన యువకుడికి కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇక గుంటూరు జిల్లాలో రెండు కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. మంగళగిరిలో దంపతులకు కరోనా లక్షణాలు కనిపించాయి. నిన్న(మార్చి 18,2020) అమెరికా నుంచి మంగళగిరికి వచ్చిన దంపతులకు నిమోనియా ఉండటంతో గుంటూరు ఫీవర్‌ హాస్పిటల్‌ ఐసోలేషన్‌ వార్డులో చికిత్స అందిస్తున్నారు. దంపతుల శాంపిల్స్‌ను విజయవాడ ల్యాబ్‌కు పంపించారు.

See Also | ఒంగోలులో కరోనా లక్షణాలు : ఏపీలో రెండో పాజిటివ్ కేసు!..హెల్ప్ లైన్ నెంబర్ల ఏర్పాటు

అటు ఏపీలో రెండో కరోనా పాజిటివ్‌ కేస్‌ నమోదైంది. ఒంగోలులో 23ఏళ్ల యువకుడిలో కరోనా లక్షణాల్ని జిల్లా వైద్యాధికారులు గుర్తించారు. వైద్య పరీక్షల తర్వాత అతడికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. దీంతో బాధితుడితో పాటు అతడి తల్లిదండ్రులు, చెల్లిని రిమ్స్‌ ఐసోలేషన్‌ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధిత యువకుడు మార్చి 12న లండన్‌ నుంచి బయలుదేరిన అతడు 15న ఒంగోలు చేరుకున్నాడు. జలుబు, దగ్గు, జ్వరం ఉండటంతో కరోనా అనుమానంతో ఒంగోలు ప్రభుత్వాసుపత్రిలో చేరాడు. శాంపిల్స్ సేకరించిన వైద్యులు తిరుపతి ల్యాబ్‌కు పంపారు. బుధవారం రాత్రి అందిన రిపోర్టుల్లో కరోనా ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. ఇప్పటికే నెల్లూరులో ఓ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇప్పుడు ఒంగోలు కేసుతో కలిపి ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 2కి చేరింది.

* కరోనా వైరస్ పై పీవీ రమేష్
* ఏపీలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు
* ఇద్దరు భాదితుల పరిస్థితి నిలకడగా ఉంది
* కరోనా నియంత్రించేందుకు గ్రామస్థాయిలో ఏర్పాట్లు
* ఇంటింటికీ వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నాం
* తిరుపతి, విజయవాడలో ఇప్పటికే ల్యాబ్ లు ఏర్పాటు

* ప్రజలు వ్యక్తిగతంగా తమను తాము నియంత్రించుకోవాలి
* విదేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా, ఐసోలేషన్ సెంటర్లకు తరలింపు
* అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దు
* విదేశాల నుంచి వచ్చే వారిని క్షుణ్ణంగా పరిశీలన
* దేశంలో అందరికంటే ముందే ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశాం