ఏపీలో కరోనా కలకలం, ప్రకాశం జిల్లాలో భార్యాభర్తలకు పాజిటివ్

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 19కి చేరింది.

  • Published By: veegamteam ,Published On : March 29, 2020 / 10:33 AM IST
ఏపీలో కరోనా కలకలం, ప్రకాశం జిల్లాలో భార్యాభర్తలకు పాజిటివ్

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 19కి చేరింది.

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రేపుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 19కి చేరింది. ప్రకాశం జిల్లాలో కరోనా కలకలం రేపింది. జిల్లాలోని చీరాలలో భార్య, భర్త కరోనా బారిన పడ్డారు. వారికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. వీరితో పాటు జిల్లా వ్యాప్తంగా సుమారు 60 మంది ఓ మత కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. ఈ బృందం ఎక్కడెక్కడ ఉందో అని అధికారులు వెతుకుతున్నాడు. ఇప్పటికే చీరాల, పేరాలలో ఇద్దరిని, చీమకూర్తిలో ఒకరిని, కందుకూరులో నలుగురిని, కనిగిరిలో ఏడుగురిని, వెలిగండ్లలో ఒకరిని అధికారులు గుర్తించారు. వీరు ఇచ్చిన ఫోన్‌ నెంబర్ల ఆధారంగా మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఈ బృందం అందిరినీ, వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌ వార్డుకు తరలించారు. ఆ బృదంతో ఇంకా ఎవరు వెళ్లారనే కోణంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. 

భారత్ లో 979 కరోనా పాజిటివ్ కేసులు, 25 మరణాలు:
మన దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 979కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 25మంది కరోనాతో చనిపోయారు. 867 మంది భాతులు ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి 86మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

మహారాష్ట్రలో 193 కరోనా కేసులు, ఏడు మరణాలు:
మహారాష్ట్రలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. మహారాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 7కి పెరిగింది. గుజరాత్ లో నలుగురు, కర్నాటకలో ముగ్గురు, ఢిల్లీ, మధ్యప్రదేశ్ లో ఇద్దరు చొప్పున కరోనాతో చనిపోయారు. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, బీహార్, బెంగాల్, తెలంగాణ, కేరళ, పుదుచ్చేరిలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో చనిపోయారు. శనివారం(మార్చి 28,2020) మహారాష్ట్రలో కరోనాతో మరొకరు చనిపోయారు. ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 40 ఏళ్ల మహిళ చనిపోయింది. చనిపోయిన తర్వాత నిర్వహించిన పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో మహారాష్ట్రలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 7కి పెరిగింది. మహారాష్ట్రలో మరో 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 193కి పెరిగింది.

ఏపీలో 19 కరోనా కేసులు:
ఇక ఏపీలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురు చొప్పున బాధితులున్నారు. ప్రకాశం జిల్లాలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా బాధితులు ఉన్నారు. ఇవాళ(మార్చి 29,2020) రాష్ట్రంలో ఒక్క కరోనా పాజిటివ్ కేసు నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ పరీక్షించిన 16 నమూనాలు నెగిటివ్ గా నిర్ధారణ అయ్యాయని వెల్లడించారు. 16మంది అనుమానితులకు కరోనా లక్షణాలు లేవని డాక్టర్లు నిర్ధారించారు. ఇప్పటివరకు 512మంది     అనుమానితుల నుంచి నమూనాలు సేకరించారు. వీటిలో 19 మందికి పాజిటివ్ రాగా, 433మందికి నెగిటివ్ వచ్చింది. 60మంది నమూనాల ఫలితాల కోసం అధికారులు వేచి చూస్తున్నారు. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన 29వేల 367 మందిని పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 29వేల 172మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు అధికారులు వివరించారు. 195మందిని ఆసుపత్రిలో చేర్చి పర్యవేక్షిస్తున్నారు.

తెలంగాణలో 67 కరోనా కేసులు:
తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 67కి చేరింది. నిన్న(మార్చి 28,2020) ఒక్క రోజే 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో తొలి కరోనా మరణం సంభవించింది. కరోనాతో వృద్ధుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత నిర్వహించిన పరీక్షల్లో వృద్ధుడికి కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో 10 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 30,880మంది కరోనాతో మృతి:
199 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా 6లక్షల 63వేల 748మంది కరోనా బాధితులున్నారు. ప్రపంచవ్యాప్తంగా 30వేల 880 మంది కరోనాతో చనిపోయారు. లక్ష 42వేల 184మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనాతో ఇటలీలో 10వేల 23మంది, స్పెయిన్ లో 5వేల 982మంది, చైనాలో 3వేల 300మంది, ఇరాన్ లో 2వేల 517మంది, ఫ్రాన్స్ లో 2వేల 314మంది, అమెరికాలో 2వేల 227మంది, యూకేలో 1,019మంది, నెదర్లాండ్స్ లో 639మంది, జర్మనీలో 433మంది, బెల్జియంలో 353మంది, స్విట్జర్లాండ్ లో 264మంది, దక్షిణ కొరియాలో 152మంది, బ్రెజిల్ లో 114మంది, టర్కీలో 108మంది, స్వీడన్ లో 105మంది, ఇండోనేషియాలో 102మంది, పోర్చుగల్ లో 100మంది, ఆస్ట్రియాలో 68మంది, ఫిలిప్పిన్స్ లో 68మంది, డెన్మార్క్ లో 65మంది, కెనాడాలో 60మంది, జపాన్ లో 52మంది చనిపోయారు.