భద్రాద్రి లేదు..ఒంటిమిట్టా లేదు..ప్రతి ఇల్లూ రామాలయమే

  • Published By: madhu ,Published On : April 2, 2020 / 01:10 AM IST
భద్రాద్రి లేదు..ఒంటిమిట్టా లేదు..ప్రతి ఇల్లూ రామాలయమే

శ్రీరామనవమి వచ్చేసింది. కానీ ఎప్పటిలాగా ఉండాల్సిన సందడి లేదు. ఎక్కడ చూసినా కనిపించే చలువ పందిళ్లు కనిపించడం లేదు. ఊర్లో రామాలయం లేదు. చివరకు ఇంటినే దేవాలయం మార్చేస్తున్నారు. పురోహితులు రాకుండానే…ఇంట్లోనే పూజలు చేస్తున్నారు. ఎందుకంటే..కరోనా రాకాసి వల్ల ఈ పరిస్థితి దాపురించిది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 

తెలంగాణాలో 9 మంది దాక మరణించారు. ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ అమలవుతోంది. ఉగాది పండుగను కూడా ప్రజలు ఘనంగా జరుపుకోలేక పోయారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు కార్యక్రమాలు కూడా రద్దు చేసింది. ఈ పండుగ తర్వాత…శ్రీరామనవమి వచ్చింది. ఇంటిలోనే పూజా కార్యక్రమాలు చేసుకోవాలని ప్రభుత్వం, ఆధ్మాత్మిక వేత్తలు, నిపుణులు సూచించడంతో అందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. 

పూజా మందిరంలో సీతారాములను కల్యాణ దంపతులుగా అలంకరించి..షోడశోపచారాలతో పూజించుకోవచ్చని సూచిస్తున్నారు. వడపప్పు, పానకం, పండ్లు, కొబ్బరి, వాటితో పాటు చేసుకున్న వాటిని ఆరగింపు చేసుకుంటే సరిపోతుందని, ఓపిక ఉన్నంత వరకు రామ నామ స్మరణ చేసుకోవాలని సూచిస్తున్నారు. 

భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణాన్ని కూడా భక్తజనాలు లేకుండా నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో రామయ్య కల్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. భక్తులెవరూ రావొద్దని..ప్రత్యక్ష ప్రసారం టీవీల్లో వీక్షించాలని ప్రభుత్వం, ఆలయ అర్చకులు సూచించారు. 

కల్యాణానికి సంబంధించిన పూజలు ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. వేద మంత్రోచ్చారణల మధ్య అభిజత్ లగ్నం సమీపించగానే..జీలకర్ర బెల్లాన్ని సీతారాముల వారి శిరస్సులపై ఉంచనున్నారు పూజారులు. వచ్చే ఏడాది ఎంతో ఘనంగా సీతారాముల కల్యాణ వేడుకలు జరుపుకుందామని సూచిస్తున్నారు. 

* భారత్‌లో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు.
* అన్ని రాష్ట్రాల సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌.
* తమిళనాడులో 234కు చేరిన కరోనా కేసులు. 

 

* ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో 110 మందికి పాజిటివ్.
* నిజాముద్దీన్ మర్కజ్‌ ఘటనపై కేంద్రం సీరియస్.
* హాజరైన వారి వివరాలు సేకరించాలని రాష్ట్రాలకు ఆదేశం.

* నిజాముద్దీన్ మర్కజ్‌ ఘటనపై కేంద్రం సీరియస్.
* హాజరైన వారి వివరాలు సేకరించాలని రాష్ట్రాలకు ఆదేశం.
 

* తెలంగాణ గ‌వ‌ర్నర్‌ను కలిసిన కేసీఆర్.
* కరోనా కట్టడికి చర్యలు, లాక్‌డౌన్ పరిస్థితులను వివరించిన సీఎం.