విశాఖలో కరోనా టెన్షన్

దేశంలోని మహా నగరాల్లోనే కరోనా వైరస్ ఉనికి బలంగా చాటుకుంటూ వస్తోంది. విశాఖ నుంచి విదేశాలకు వెళ్ళిన వారు తిరిగిరావడంతో స్మార్ట్ సిటీలో ఒక్కసారిగా కరోనా కేసులు కనిపిస్తున్నాయి.

  • Published By: veegamteam ,Published On : March 21, 2020 / 02:16 PM IST
విశాఖలో కరోనా టెన్షన్

దేశంలోని మహా నగరాల్లోనే కరోనా వైరస్ ఉనికి బలంగా చాటుకుంటూ వస్తోంది. విశాఖ నుంచి విదేశాలకు వెళ్ళిన వారు తిరిగిరావడంతో స్మార్ట్ సిటీలో ఒక్కసారిగా కరోనా కేసులు కనిపిస్తున్నాయి.

దేశంలోని మహా నగరాల్లోనే కరోనా వైరస్ ఉనికి బలంగా చాటుకుంటూ వస్తోంది. ముంబై, ఢిల్లీ, లక్నోలతో పాటు దక్షిణాన కేరళ, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ లలో కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు ఉండడంతో పాటు పెద్ద సంఖ్యలో విదేశాల నుంచి వచ్చిన వారితోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. 

విశాఖ నుంచి విదేశాలకు వెళ్ళిన వారు తిరిగిరావడంతో స్మార్ట్ సిటీలో ఒక్కసారిగా కరోనా కేసులు కనిపిస్తున్నాయి. విశాఖలో ఒక్క పాజిటివ్ కేస్ ఇప్పటికీ నమోదు కాకపోయినా, అనుమానిత కేసులు పదుల సంఖ్యలో కనిపిస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వారు ఎలాంటి పరీక్షలు చేయించుకోకుండా వారంతా తమ ఇళ్ళకు, ప్రాంతాలకు నేరుగా వెళ్ళిపోవడం వల్ల వచ్చిన పరిస్థితి ఇది.

దీంతో విశాఖ నగరవాసుల్లో భయాందోళన కనిపిస్తోంది. తమ ప్రాంతాలకు ఎవరు వచ్చారో, కరోనా వైరస్ ను ఎవరు పట్టుకొచ్చారోనన్న టెన్షన్ నెలకొంది. దాంతో జనతా కర్ఫ్యూకు ముందుగానే నగరంలో అప్రక‌టిత‌ కర్ఫ్యూ కనిపిస్తోంది.