రెండు వారాలు చాలా కీలకం : లాక్ డౌన్ ఏకైక ఆయుధం..లేకపోతే ఊహించని పరిణామాలు!

  • Published By: madhu ,Published On : April 2, 2020 / 08:01 AM IST
రెండు వారాలు చాలా కీలకం : లాక్ డౌన్ ఏకైక ఆయుధం..లేకపోతే ఊహించని పరిణామాలు!

కరోనా వైరస్ కుమ్మేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ భూతం..ఇప్పట్లో వదిలేలా లేదు. వేలాది కేసులు నమోదు అవుతుండడంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. ఇది ఏప్రిల్ 14వ తేదీ వరకు ముగియనుంది. కానీ ఏప్రిల్ 02వ తేదీకి చేరుకున్నా..కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గకపోవగా..ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.

వేలాది మంది సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. 50 మంది చనిపోవడం తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. ప్రస్తుతం రెండు వారాలు చాలా కీలకంగా మారనుంది. కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలవుతే..వైరస్ వ్యాపించకుండా చేయగలమని నిపుణులు వెల్లడిస్తున్నారు.

లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందంటున్నారు. ఖచ్చితంగా ఇళ్లలోనే ఉండాలంటూ నినాదాలు మిన్నంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం వణుకుపుట్టిస్తోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. 

ప్రస్తుతం ఈ వైరస్ తరిమికొట్టాలంటే..ఏకైక ఆయుధం లాక్ డౌని అని చెబుతున్నారు. ఇది ఖచ్చితంగా పాటించాలని స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పదే పదే వినమ్రంగా విజ్ఞప్తి చేశారు. కానీ ప్రజలు మాత్రం లెక్కచేయడం లేదు. ఇష్టమొచ్చినట్లుగా రోడ్లమీదకు వస్తున్నారు. గుంపులు గుంపులుగా తిరుతున్నారు.

ఇప్పటి వరకు జరిగిందోదే జరిగింది..ఇప్పటి నుంచైనా (రెండు వారాలు) పకడ్బందిగా లాక్ డౌన్ పాటించాలని వైద్యులు, నిపుణులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో ఎవరూ ఊహించని పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని అంటున్నారు. 

తొలుత తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో నిజాముద్దీన్ ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఒక్కసారిగా ఆందోళనకరంగా మార్చివేసింది. వెయ్యి మందికి పైగా తెలంగాణ వాసులు ఈ
సమావేశానికి వెళ్లి జనాల మధ్య తిరగడంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. 

Also Read | ఐదుగురు కరోనా అనుమానితులు పరారీ.. ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు