Chittoor : చిత్తూరు జిల్లాలో దంపతుల మృతదేహాలు లభ్యం

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో దంపతుల మృతదేహాలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని రామచంద్రపురం మండలం చిట్టత్తూరు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

10TV Telugu News

Chittoor : ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా అటవీ ప్రాంతంలో దంపతుల మృతదేహాలు కలకలం సృష్టించాయి. జిల్లాలోని రామచంద్రపురం మండలం చిట్టత్తూరు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు దంపతుల మృతదేహాలను పరిశీలించారు.. మూడు రోజుల క్రితం హత్యకు గురైనట్లు పేర్కొన్నారు. దంపతులది తమిళనాడు తిరుత్తణి అని గుర్తించారు.. నాలుగు రోజుల క్రితం తిరుత్తణి పోలీస్ స్టేషన్ లో దంపతులు మిస్ అయినట్లు కేసు నమోదైంది. కాగా మూడు రోజుల క్రితం హత్యచేసి అడవిలో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

మృతులు సంజీవరెడ్డి (60), మాల (60) గా తమిళనాడు తిరుత్తణి పోలీసులు గుర్తించారు.ఘటనకు ఆస్తి వివాదాలే కారణమని ప్రాధమికంగా నిర్దారించారు పోలీసులు.

10TV Telugu News