తనకంటే పెద్దదైన మహిళతో వివాహేతర సంబంధం–అందరికీ తెలిసే సరికి….

తనకంటే పెద్దదైన మహిళతో వివాహేతర సంబంధం–అందరికీ తెలిసే సరికి….

couple ends life, due to extra marital affair in srikakulam district : వాళ్ళిద్దరూ చేస్తున్న పని సమాజం హర్షించదని తెలుసు …. ఎవరూ ఒప్పకోరని తెలుసు….. క్షణికమైన ఆనందం కోసం హద్దు మీరారు… సమాజాన్ని ఎదిరించే ధైర్యం చేయలేక పోయారు…కన్న బిడ్డల గురించి ఆలోచించలేదు.

కాలం గడిచే కొద్దీ కలిసి జీవించలేమని అర్ధం అయ్యింది. సమాజంలో ఇలాంటి ఘటనలు చూస్తూనే ఉన్నా కూడా, వివాహేతర సంబంధంపై ఆసక్తి చూపించారు. అయినా కలిసి బతకలేమని నిర్ణయించుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మహిళ మృతి చెందగా ..యువకుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయనిపాలేనికి  చెందిన బోనెల ప్రియాంక(32)కు పన్నేండేళ్ళ క్రితం సూర్యనారాయణ అనే వ్యక్తితో వివాహాం అయ్యింది. వీరికి ముగ్గురు పిల్లలు పుట్టారు.  సూర్యనారాయణ ఒక ప్రైవేట్ కంపెనీలో వంట మాస్టారుగా పని చేస్తుండగా…. ప్రియాంక కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకునేవారు.

ఈ క్రమంలో ప్రియాంకకు మూడేళ్ల కిందట బోనెల  సంతోష్(30) అనే ఆటో డ్రెవర్ పరిచయం అయ్యాడు. అది క్రమేపి వివాహేతర సంబంధానికి దారి తీసింది. తన కంటే వయస్సులో పెద్దదని తెలిసినా, ముగ్గురు పిల్లల తల్లి అని తెలిసి కూడా సంతోష్ ప్రియాంకతో వివాహేతర సంబంధం పెట్టుకోటానికి వెనుకాడలేదు.

ప్రియాంక కూడా ముగ్గురు పిల్లలు ఉన్నసంగతి, సంతోష్  తనకంటే వయస్సులో చిన్నవాడు అనే విషయాలను పక్కన పెట్టింది. భర్త వద్ద కన్న సంతోష్ తో ఉన్నప్పుడే ఆనందంగా ఉండసాగింది. ఇద్దరి బంధాన్ని సమాజం హర్షించదని తెలిసినా క్షణికానందంలో అవేమి వారికి గుర్తుకు రాలేదు. ప్రేమ జంట జీవితాన్ని ఎంజాయ్ చేయసాగింది.

కొన్నాళ్లకు  ఈవిషయం ఆమె భర్త సూర్యనారాయణకు తెలిసి పోయింది. భార్యను మందలించాడు. అయినా ఆమె సంతోష్ తో బంధాన్ని వదులుకోలేక  పోయింది. దీంతో సూర్యనారాయణ పెద్దల వద్ద పంచాయతీ పెట్టగా… వారు కూడా ప్రియాంకను మందలించారు. ప్రేమ మైకంలో ఉన్న ప్రియాంకకు ఇవేమీ పట్టటం లేదు. ఈ క్రమంలో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి.

బంధువులు,స్నేహితుల ద్వారా చెప్పి చూసినా ప్రియాంక సంతోష్ తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇన్ని జరుగుతున్నా సంతోష్ కూడా తన తీరు మార్చుకోలేదు. వివాహితైన ప్రియాంకతో బంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో రాను రాను అందరూ హితవు చెప్పటం ఎక్కువయ్యే సరికి అంతా తమ బంధానికి అడ్డుపడుతున్నారని భావించి కలిసి చనిపోవటానికి నిర్ణయించుకున్నారు.

సోమవారం మార్చి 1వ తేదీ రాత్రి ఇద్దరూ ఇళ్లలోంచి బయటకు వచ్చేశారు. కేశవరాయనిపాలెం నుంచి చిలకపాలెం చేరుకున్నారు. సమీపంలోని తోటలోకి వెళ్లి తమతో తెచ్చుకున్న పురుగు మందు తాగేశారు. కొద్ది సేపటి తర్వాత ఈవిషయాన్ని తమ గ్రామంలోని స్నేహితులకు, బంధువులకు ఫోన్ చేసి చెప్పారు.

దీంతో స్నేహితులు, బంధువులు వీరి కోసం గాలిస్తూ చిలకపాలెం చేరుకుని తోటల్లో వెతికారు. కొంతసేపటి తర్వాత ఇద్దరినీ గుర్తించిన బంధువులు….అపస్మారకస్ధితికి చేరుకున్న ఇద్దరినీ శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకెళ్లిన కొద్ది సేపటికి ప్రియాంక చనిపోగా…. సంతోష్ చావుతో పోరాడుతున్నాడు.

ఈ ఘటనతో ముగ్గురు పిల్లలు తల్లి లేనివారయ్యారు. ప్రియాంక మృతదేహానికి డాక్టర్లు పోస్టు మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.