ఎంత చదువుకుంటే ఏం లాభం, పిచ్చి నమ్మకాలు..కన్నతల్లే యమపాశం

ఎంత చదువుకుంటే ఏం లాభం, పిచ్చి నమ్మకాలు..కన్నతల్లే యమపాశం

couple murder : తల్లి ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్, తండ్రి డిగ్రీ కాలేజ్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌.. ఇద్దరు ఉన్నత చదువులు చదివారు. పిల్లలిద్దరిని పెద్ద చదువులు చదివించారు. ఎంత చదువుకుంటే ఏం లాభం… వాళ్లను ఆవహించిన మూఢభక్తి… చివరకు కన్న పిల్లలనే బలితీసుకునేలా చేసింది. కలియుగం అంతమైపోవడం… సత్య లోకం మొదలవడం వంటి…పిచ్చి నమ్మకాలతో వయసుకొచ్చిన ఇద్దరు ఆడ పిల్లలను అత్యంత దారుణంగా చంపేశారు. ఎన్నో అశలతో, కలలతో ఎదుగుతున్న పిల్లల పాలిట కన్న తల్లే యమపాశంగా మారింది.

ఇద్దరి జీవితాల్ని యుక్త వయసులోనే చిదిమేసింది. అవును మూఢభక్తి రెండు నిండు ప్రాణాలను బలిగొంది. మితిమీరిన మూఢభక్తితో తల్లిదండ్రులే తమ ఇద్దరు కుమార్తెలను అత్యంత దారుణంగా హత్య చేశారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలను మూడభక్తికి బలిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.

చదువుకున్న సమాజంలో దొరికినంత మూర్ఖులు.. అడవుల్లో పెరిగిన అనాగరికుల్లో కూడా దొరకరన్న సామేత ఊరికే పుట్టలేదని ఇలాంటి ఘటనలు చూస్తే అర్ధమవుతుంది. చిత్తూరు జిల్లాలో ఇద్దరు కూతుళ్లను తల్లిదండ్రులే ఆధ్యాత్మిక పిచ్చిలో కొట్టి దారుణంగా చంపేశారు. పెద్ద చదువులు చదువుకొని…పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ మూర్ఖులుగా వ్యవహరించారు. మదనపల్లెలో సంచలనం సృష్టించిన హత్యోదంతంతో విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి.

కన్న తల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు నిర్థారణయింది. ఇద్దరు పిల్లల్ని తల్లి పద్మజనే చనిపోవడానికి ఒత్తిడి చేసింది. వారు నిరాకరించడంతో బలవంతంగా పూజలో కూర్చోబెట్టింది. ఇద్దర్ని నగ్నంగా ఉంచి పూజలు చేయించింది. వద్దని వారిస్తోన్న కూతుళ్లను డంబెల్‌తో కొట్టి చంపింది. ఈ తతంగం జరుగుతున్న సేపంత వారి ఇంట్లో గంటలు మోగుతునే ఉన్నాయి. ఈ కుటుంబమంత కర్ణాటకాకు చెందిన మోహర్‌ బాబా శిష్యులుగా తెలుస్తోంది.