Hang Husband : ఆ అనుమానంతో గర్భవతి భార్యను కిరాతకంగా చంపిన భర్త, సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు

అనుమానం పెనుభూతమైంది. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అత్యంత కిరాతకంగా ఆమెను కడతేర్చాడు. ఈ హత్య కేసులో విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ భర్తకు

Hang Husband : ఆ అనుమానంతో గర్భవతి భార్యను కిరాతకంగా చంపిన భర్త, సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు

Hang Husband

Hang Husband : అనుమానం పెనుభూతమైంది. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త అత్యంత కిరాతకంగా ఆమెను కడతేర్చాడు. ఈ హత్య కేసులో విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ భర్తకు ఉరిశిక్ష విధించింది. 2019లో నగరంలోని కృష్ణలంకలో గర్భవతిగా ఉన్న తన భార్యపై భర్త బత్తుల నంబియార్‌ పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె మృతిచెందింది. ఈ కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం ఈరోజు(ఏప్రిల్ 8,2021) తీర్పు చెప్పింది.

అసలేం జరిగిందంటే…
కృష్ణాజిల్లా కోడూరు మండలం లింగాయపాలెంకు చెందిన ముక్కు మోహనరావుకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. పెద్ద కూతురు శైలజ.. తన ఇద్దరు చెల్లెళ్లు పద్మజ, జ్యోతి, తమ్ముడు అరవింద్‌ కుమార్‌తో కలిసి కొన్నేళ్ల కిందట లబ్బీపేటలోని ఫకీర్‌గూడెం పిడికిటి రామకోటయ్య వీధిలోని ఒక ఇంట్లో అద్దెకు దిగారు. అందరూ ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. బీఎస్సీ బీఈడీ చదివిన శైలజ(30) టిక్కిల్‌రోడ్‌లోని ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పని చేసేవారు. హాయిగా సాగిపోతున్న ఆమె జీవితంలో బత్తుల నంబియర్ అనే వ్యక్తి ఎంటర్ అయ్యాడు. తాను అతడి చేతిలోనే హతమవుతానని ఆమె ఊహించ లేదు.

పెళ్లయిన కొన్ని రోజులకే:
కృష్ణాజిల్లా జొన్నపాడు నివాసి అయిన బత్తుల నంబియార్(35) అలియస్ సుజిత్ గుడివాడలో ప్రైవేట్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసేవాడు. సుశీలకు నంబియార్ తో వివాహమైంది. పెళ్లయిన కొద్ది రోజులకే అతడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. ఉద్యోగాన్ని మానేశాడు. విజయవాడ ఫకీర్‌గూడెంలోని భార్య దగ్గరే ఉండేవాడు. ఆమె సంపాదనపైనే ఆధారపడి జీవించేవాడు.

భార్యపై అనుమానం పెంచుకున్నాడు:
ఈ నేపథ్యంలో భార్యకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం నంబియార్ లో మొదలైంది. దీని గురించి అతడు పలు సార్లు మరదళ్లు, అత్త దగ్గర ప్రస్తావించాడు. అయినప్పటికీ వారు పట్టించుకోలేదు. దీనికి తోడు ఇటీవల శైలజ తన ఇద్దరు చెల్లెళ్లకు, తమ్ముడికి వివాహాలు కూడా జరిపించింది. అంతే నంబియార్‌ అసూయతో రగిలిపోయాడు. భార్యను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి, తెల్లవారుజామున నిద్రలో ఉన్న శైలజ ఒంటిపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో ఆమె గర్భవతి. అయినా అతడు కనికరించలేదు. కిరాతకానికి ఒడిగట్టాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శైలజను చుట్టుపక్కల వారు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కాసేపటికే ఆమె మరణించింది.

కేసు నమోదు చేసిన పోలీసులు నంబియార్‌ను కోర్టులో హాజరు పరిచారు. విచారణ తర్వాత నంబియారే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో న్యాయస్థానం అతడికి ఉరిశిక్ష విధించింది. కోర్టు తీర్పుపై బాధితురాలి కుటుంబసభ్యలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుమానంతో కట్టుకున్న భార్యనే కడతేర్చిన నీచుడికి సరైన శిక్ష పడిందన్నారు.