Covid -19 AP : ఏపీలో కరోనా కేసులు..24 గంటల్లో 8 వేల 239 కేసులు

ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 8 వేల 239 మందికి కరోనా సోకింది. 61 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Covid -19 AP : ఏపీలో కరోనా కేసులు..24 గంటల్లో 8 వేల 239 కేసులు

Ap Covid 19

AP COVID-19 Cases : ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా…గత 24 గంటల వ్యవధిలో 8 వేల 239 మందికి కరోనా సోకింది. 61 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 96 వేల 100 యాక్టివ్ కేసులు ఉండగా..11 వేల 824 మంది చనిపోయారు.

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 10 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 17,93,227 పాజిటివ్ కేసులకు గాను 16,85,303 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 96,100గా ఉంది.

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారు ?
చిత్తూరు జిల్లాలో పది మంది, ప్రకాశంలో ఏడుగురు, శ్రీకాకుళంలో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఏడుగురు, విశాఖపట్టణంలో ఆరుగురు, అనంతపూర్ లో ఐదుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, వైఎస్ఆర్ కడపలో నలుగురు, కృష్ణాలో నలుగురు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు చనిపోయారు.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 698. చిత్తూరు 1396. ఈస్ట్ గోదావరి 1271. గుంటూరు 488. వైఎస్ఆర్ కడప 693. కృష్ణా 462. కర్నూలు 201. నెల్లూరు 407. ప్రకాశం 561. శ్రీకాకుళం 421. విశాఖపట్టణం 500. విజయనగరం 254. వెస్ట్ గోదావరి 887. మొత్తం : 8239

Read More : Huzurabad Politics : మారుతున్న హుజురాబాద్ రాజకీయం..టీఆర్ఎస్‌‌లోకి కౌశిక్ రెడ్డి ?