AP Corona Cases: ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. మూడు జిల్లాల్లో మాత్రం తగ్గట్లేదు

రాష్ట్రంలో కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కొవిడ్ రూల్స్ విషయంలో పక్కాగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే కేసులు తగ్గుముఖం పట్టినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.

AP Corona Cases: ఏపీలో తగ్గిన కరోనా కేసులు.. మూడు జిల్లాల్లో మాత్రం తగ్గట్లేదు

Corona

AP Corona Cases: రాష్ట్రంలో కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కొవిడ్ రూల్స్ విషయంలో పక్కాగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే కేసులు తగ్గుముఖం పట్టినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు తగ్గడం ఊరటనిస్తోండగా.. చిత్తూరు, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో మాత్రం రోజువారీ కేసులు 300కు పైగా నమోదవుతూ ఉన్నాయి.

గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 93,785 శాంపుల్స్‌ని పరీక్షించగా 2,526 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు చూస్తే.. అనంతపురం జిల్లాలో 80, చిత్తూరు జిల్లాలో 391, తూర్పుగోదావరి జిల్లాలో 404, గుంటూరు జిల్లాలో 178, కడప జిల్లాలో 157, కృష్ణాజిల్లాలో 269, కర్నూలు జిల్లాలో 35, నెల్లూరు జిల్లాలో 210, ప్రకాశం జిల్లాలో 308, శ్రీకాకుళం జిల్లాలో 91, విశాఖపట్నం జిల్లాలో 119, విజయనగరం జిల్లాలో 49, పశ్చిమగోదావరి జిల్లాలో 235 పాజిటివ్ కేసులు మోదయ్యాయి.

గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావంతో 22 మంది చనిపోగా.. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 13,081కి చేరుకుంది. ఇదే సమయంలో 2,933 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. రాష్రంలో ఇప్పటివరకు 2,33,14,697 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 25వేల 526గా ఉంది.