AP Corona Cases : ఏపీలో 14 వేలు దాటిన కరోనా కేసులు..లాక్ డౌన్ తప్పదా ?

AP Corona Cases : ఏపీలో 14 వేలు దాటిన కరోనా కేసులు..లాక్ డౌన్ తప్పదా ?

Ap Corona Cases

AP Corona Cases : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ వైరస్‌ బారిన పడుతోన్న బాధితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.  మృతుల సంఖ్య సైతం పెరుగుతోంది.

గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 74,681 పరీక్షలు నిర్వహించగా.. 14,669 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనాతో బాధపడుతూ 71 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా సోమవారం 11,434 కరోనా పాజిటివ్ కేసులు రాగా మంగళవారం వాటి సంఖ్య 14,669 పెరగటంతో వైరస్ వ్యాప్తిఆందోళన కలిగిస్తోంది.

మొత్తం ఇప్పటివరకూ 1,62,17,831 కరోనా పరీక్షలు నిర్వహిస్తే, 10,69,544మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. ఈ పరిస్ధితి చూస్తుంటే  ఏపీలోనూ లాక్ డౌన్ విధించక తప్పేలా లేదని పలువురు భావిస్తున్నారు.

రాష్ట్రంలో  వైరస్‌ కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని తెలిపారు. కోవిడ్‌ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. కరోనా బాధితుల కోసం 37 వేల వరకు బెడ్స్‌ పెంచామని చెప్పారు. అవసరానికి తగ్గట్టు ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచినట్లు.. ఎవరూ ఆందోళన చెందొద్దని ఆయన భరోసా ఇచ్చారు.

మరో వైపు పక్కనే ఉన్నతెలంగాణలో ఏప్రిల్ 30 నుంచి లాక్ డౌని విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ పై వైద్య ఆరోగ్య శాఖ తన నివేదికను హోంశాఖకు పంపించింది. హైదరాబాద్ లో తెలంగాణ హోం మంత్రి మహమ్మూద్ ఆలీ ఆధ్వర్యంలో ఉన్నతస్ధాయి అధికారులు సమావేశమయ్యారు.