Vaccination: ఏపీ కొత్త రికార్డ్.. ఒక్కరోజులో 13లక్షల మందికి వ్యాక్సిన్!

కరోనాపై పోరాటంలో ఆంధ్రప్రదేశ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచింది. ఈ క్రమంలోనే రాష్ట్రం నయా రికార్డ్ క్రియేట్ చేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కొద్ది వారాలుగా విస్తృతంగా వ్యాక్సినేషన్ చేస్తుండగా.. ఒక్క రోజులోనే 13లక్షల మందికి పైగా వ్యాక్సినే వేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

Vaccination: ఏపీ కొత్త రికార్డ్.. ఒక్కరోజులో 13లక్షల మందికి వ్యాక్సిన్!

Record number of people vaccinated

Covid Vaccination: కరోనాపై పోరాటంలో ఆంధ్రప్రదేశ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచింది. ఈ క్రమంలోనే రాష్ట్రం నయా రికార్డ్ క్రియేట్ చేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కొద్ది వారాలుగా విస్తృతంగా వ్యాక్సినేషన్ చేస్తుండగా.. ఒక్క రోజులోనే 13లక్షల మందికి పైగా వ్యాక్సినే వేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఉదయం 6 గంటలకు వ్యాక్సినేషన్ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం.. మధ్యాహ్నం 2 గంటలకే 7లక్షల 88వేల 634మందికి వ్యాక్సిన్ వేసింది.

మధ్యాహ్నం నుంచి రాష్ట్రంలో లక్ష్యాన్ని మించి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. ముందుగా 8లక్షల మందికి వ్యాక్సిన్ వెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించగా.. అంతకుమించి, రాష్ట్ర వ్యాప్తంగా 2,232 కేంద్రాల్లో డ్రైవ్‌ నడవగా.. 45ఏళ్లు పైబడిన వారు, ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు వ్యాక్సినేషన్‌ వేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో 1.43 లక్షల మందికి, కృష్ణా జిల్లాలో 1.31 లక్షల మందికి, విశాఖ జిల్లాలో 1.10 లక్షల మందికి, గుంటూరు జిల్లాలో 1.01 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశారు.

కాగా, కరోనా విజృంభించిన వేళ ఆక్సిజన్‌ నిల్వలను, ఆసుపత్రుల్లో బెడ్స్‌ను పెంచటంపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఇపుడు కేసులు తగ్గుతుండటంతో ఒకవైపు కట్టడి చేస్తూనే వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టి వ్యాక్సిన్లను వేస్తుంది ప్రభుత్వం. దీంతో ఇవాళ(20 జూన్ 2021) మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ముగిసింది. ఈ వ్యాక్సిన్‌ డ్రైవ్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.