మాస్క్ లేదా..అయితే..నో ఎంట్రీ..ఏపీలో మార్గదర్శకాలు

  • Published By: madhu ,Published On : October 10, 2020 / 05:53 AM IST
మాస్క్ లేదా..అయితే..నో ఎంట్రీ..ఏపీలో మార్గదర్శకాలు

covid guidelines : ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికే కేంద్రం అన్ లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. మార్గదర్శకాలు విడుదల చేస్తున్నాయి. అలాగే..ఏపీలో వ్యాపార కార్యకలాపాలకు పున:ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి.



అక్టోబర్ 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్న మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ మేరకు 2020, అక్టోబర్ 09వ తేదీ శుక్రవారం ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలు, స్కూళ్లు, కాలేజీలు, మాల్స్, షాపులు, ఆఫీసులు, వాణిజ్య సముదాయాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది.



లేనిపక్షంలో లోనికి అనుమతించొద్దని వెల్లడించింది. అలాగే..భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, శానిటైజేషన్‌ జరగాలని సూచించారు. ఈ నిబంధనలు అమలయ్యేలా వైద్యారోగ్యశాఖ అధికారులు, కలెక్టర్లు తదితరులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.



ప్రభుత్వ కార్యాలయాల్లో కోవిడ్‌ జాగ్రత్తలతో కూడిన పోస్టర్లుండాలి.
రద్దీ ప్రాంతాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి.
కరోనా లక్షణాలుంటే స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకునేలా జనాన్ని చైతన్యపర్చాలి.



కోవిడ్‌ సోకిన వారి పట్ల వివక్ష లేకుండా చూడాలి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేలా చూడాలి.
ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో గ్రామాలు, పట్టణాల్లో యోగా, మెడిటేషన్‌ క్లాసులు నిర్వహించాలి.



స్కూళ్లలో ప్రత్యేక చర్యలు చేపట్టాలి. హ్యాండ్‌ శానిటైజర్స్‌ వాడేలా విద్యార్థులను ప్రోత్సహించాలి.
ప్రతి క్లాస్ కు ఒకసారి శానిటైజేషన్‌ చేయాలి. అలాగే..విద్యార్థుల మధ్య భౌతికదూరం ఉండేలా చర్యలు తీసుకోవాలి.



సినిమా హాళ్లలో టెలి ఫిల్మ్‌లు ప్రదర్శించేలా చర్యలు తీసుకోవడంతో పాటు అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కరోనా నియంత్రణపై ప్రకటనలివ్వాలి.
పండుగల నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.