Covid in AP : కోవిడ్ ఆసుపత్రుల్లో కరెంటు పోవద్దు, మరింత మంది వైద్యుల నియామకం – సీఎం జగన్

కోవిడ్ మేనేజ్ మెంట్ లో భాగంగా..మూడెంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిరంతర పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ, జిల్లా స్థాయిలో ఫ్లైయింగ్ స్వ్కాడ్, కలెక్టర్లకు మరిన్ని అధికారులు కల్పించారు సీఎం జగన్.

Covid in AP : కోవిడ్ ఆసుపత్రుల్లో కరెంటు పోవద్దు, మరింత మంది వైద్యుల నియామకం – సీఎం జగన్

Ap Cm Jagan

CM Jagan Mohan Reddy : ఏపీ రాష్ట్రంలో కోవిడ్ విస్తరిస్తుండడంతో మరిన్ని నిర్ణయాలు తీసుకొంటోంది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం వైరస్ ఏ స్థాయిలో ఉంది ? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకొనేందుకు సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడికి సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

కోవిడ్ మేనేజ్ మెంట్ లో భాగంగా..మూడెంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిరంతర పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ, జిల్లా స్థాయిలో ఫ్లైయింగ్ స్వ్కాడ్, కలెక్టర్లకు మరిన్ని అధికారులు కల్పించారు సీఎం జగన్. జాయింట్ కలెక్టర్లకు పూర్తి బాధ్యతలు అప్పచెప్పారు.

104 కా్ సెంటర్ నిర్వహణ, వైద్య సేవలపై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. అదనంగా ఆక్సిజన్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. కోవిడ్ ఆసుపత్రుల్లో క్షణం కూడా కరెంటు పోకుండా చూడాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సిటీ స్కాన్, ఆర్టీపీసీఆర్ టెస్టుల ధరలకు కళ్ళెం వేయాలని సూచించారు. సిటీ స్కాన్ కు రూ. 3 వేలకు మించి, ఆర్టీపీసీఆర్ టెస్టుకు రూ. 499కి మించి వసూలు చేయొద్దని సూచించారు.

ఒకవేళ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే..డయాగ్నస్టిక్ సెంటర్లు, ల్యాబ్ ల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు. కోవిడ్ నియంత్రణ కోసం మరింత మంది వైద్యులను నియమించాలని సీఎం జగన్ నిర్ణయించారు. 1,170 మంది స్పెషలిస్టు డాక్టర్లతో పాటు మరో 1,170 మంది జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు, 2 వేల మంది సాఫ్ట్ నర్సులు, 306 మంది అనస్థీషియా టెక్నీషియన్లు, 330 మంది FNOలు, 300 మంది MNOలు, 300 మంది స్వీపర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయాలన్నారు.

Read More : Telugu states : కరోనా కల్లోలం, లాక్ డౌన్ పై తెలుగు రాష్ట్రాల నిర్ణయం ఏమిటో