ఏపీలో మలి విడత కోవిడ్ వ్యాక్సిన్

ఏపీలో మలి విడత కోవిడ్ వ్యాక్సిన్

Covid vaccine in AP : ఏపీలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ మలివిడత కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, రెవెన్యూ శాఖల్లోని ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగులకు మలివిడతలో టీకాలు వేస్తామన్నారు మంత్రి ఆళ్లనాని. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సెకండ్‌ ఫేజ్‌లో ఫ్రంట్‌లైన్‌ ఉద్యోగులకు టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే వ్యాక్సిన్లు రాష్ట్రానికి చేరుకున్నాయి. కోవిన్‌ యాప్‌లో నమోదైన 5 లక్షల 90 వేల మందికి తగినట్లు మూడు వేల 181 పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తొలివిడత కింద గుర్తించిన మూడు లక్షల 88 వేల మంది ఆరోగ్య సిబ్బందిలో

ఇంతవరకు 48.9 శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ప్రస్తుతం 16 లక్షల 31 టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని ఉన్నతాధికారులు చెప్పారు. మరోవైపు…2021, ఫిబ్రవరి 02వ తేదీ మంగళవారం రాష్ట్రంలో 21,922 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 64 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. ఒకేరోజు 99 మంది కోలుకున్నారు. ఇప్పటికి 1,31,59,794 టెస్టులు చేయగా, 8,87,900 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 8,79,504 మంది కోలుకోగా, 1,242 మంది చికిత్స పొందుతున్నారు. 7,154 మంది చనిపోయారు.