ఆంధ్రాలో కరోనా వైరస్.. భారీగా పెరిగిన కేసులు

ఆంధ్రాలో కరోనా వైరస్.. భారీగా పెరిగిన కేసులు

Single Day 2331 Covid Cases In Ap

COVIDUpdate: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా సెకెండ్ వేవ్‌లో రాష్ట్రంలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత అధికం అవుతుండగా.. ఇటీవలికాలంలో రోజువారీ కేసులతో పోలిస్తే ఒక్కరోజులో నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24గంటల వ్యవధిలో 31వేల 812 నమూనాలను పరీక్షించగా 2వేల 331 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

అత్యధికంగా గుంటూరు జిల్లాలో 368, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 20 కేసులు నమోదైనట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9లక్షల 13వేల 274కి చేరుకుంది. గడిచిన 24గంటల్లో కరోనా కారణంగా 11మంది చనిపోగా..రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 7,262కి చేరుకుంది.

గత 24గంటల్లో చిత్తూరు జిల్లాలో నలుగురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు, అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఇదే సమయంలో 853 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 13,276 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.