Apartment in danger : కూలిపోయే దశలో అపార్ట్ మెంట్..జాకీలతో నిలబెట్టి జీవిస్తున్న ప్రజలు

కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న అపార్ట్ మెంట్ ని జాకీలతో నిలబెట్టి దాంట్లోనే నివసిస్తున్నారు ప్రజలు. పిల్లర్లకు పగుళ్లు వచ్చి ఏ క్షణమైనా కూలిపోవటానికి సిద్ధంగా ఉన్న అపార్ట్ మెంట్ లో 33 ప్లాట్స్ కు సంబంధించిన ప్రజలు అత్యంత ప్రమాదంలో ఉన్నారు.

10TV Telugu News

Apartment in danger : వర్షాకాలం వచ్చిదంటే పాత భవనాలు భయపెడుతుంటాయి. వర్షాలకు గోడలు..పునాదులు నానిపోయి ఏ క్షణమైనా కూలిపోయేలా ఉంటాయి. ఇటువంటివాటితో ఆ భవనాల్లో నివసించేవారికే కాదు ఆ చుట్టుపక్కల స్థానికులకు కూడా ప్రమాదంగా జరిగే అవకాశాలున్నాయి. అటువంటి ప్రమాదంలోనే ఉంది ఏపీ పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో ఉన్న ఓ అపార్ట్ మెంట్. 17 సంవత్సరాల క్రితం నిర్మించిన ఓ అపార్ట మెంట్ ఏ క్షణమైనా కూలిపోవటానికి సిద్దంగా ఉంది. దీంతో దాంట్లో నివసిస్తున్న ప్రజలేకాకుండా స్థానికులు కూడా భయాందోళనలో ఉన్నారు.

ఆ అపార్ట్ మెంట్ ఎంత ప్రమాదంలో ఉంది అంటే సెల్లార్ లోని పిల్లర్లకు తీవ్రంగా పగుళ్ల ఏర్పడ్డాయి.అయినా పిల్లర్లకు జాకీలతో సపోర్ట్ చేసి అలాగే నివసిస్తున్నారు అపార్ట్ మెంట్ వాసులు. ఈ అపార్ట్ మెంట్ ఐదు అంతస్థుల్లో ఉండగా మొత్తం 33 ప్లాట్స్ ఉన్నాయి. ఈ ప్లాట్స్ వాసులు భయపడుతునే దాంట్లోనే నివసిస్తున్నారు. 17 సంవత్సరాల క్రితం బిల్డర్ అల్లూరి సత్యనారాయణ నిర్మించిన ఈ అపార్ట్ మెంట్ ఇప్పుడు పెను ప్రమాదంలో ఉంది.ఏ క్షణమైనా కూలిపోవటానికి సిద్ధంగా ఉంది.ఈ క్రమంలో పిల్లర్లకు పగుళ్లు పెద్దవి కావటంతో భయపడిని అపార్ట్ మెంట్ వాసులు ఒక్కొక్కరుగా ప్లాట్స్ ఖాళీ చేస్తున్నారు.

10TV Telugu News