అమరావతి భూముల కేసులో సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ అరెస్టు

  • Published By: bheemraj ,Published On : June 3, 2020 / 07:00 PM IST
అమరావతి భూముల కేసులో సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ అరెస్టు

అమరావతి భూముల కేసులో సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ మాధురిని సిట్ పోలీసులు అరెస్టు చేశారు. తుళ్లూరు మండలం నెక్కల్ లో సీఆర్డీఏ అధికారిగా పని చేసిన మాధురి 2016 లో నెక్కల్ గ్రామానికి చెందిన రావెల గోపాలకృష్ణకు మూడు ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేసిన సిట్ బృందం భూముల అక్రమ బదలాయింపుల జరిగినట్లు నిర్ధారించారు.

దీంతో (జూన్ 3, 2020) ఆమెను విజయవాడలోని తన నివాసంలో అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపించారు. నెల రోజుల క్రితం గోపాలకృష్ణను కూడా అదుపులోకి తీసుకున్నారు. నెల రోజుల క్రితం గోపాలకృష్ణ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

టీడీపీ హయాంలో నెక్కల్ లో అనంతవరం, రాయపూడి డిప్యూటీ కలెక్టర్ గా పని చేస్తున్న  ప్రభుత్వానికి 26 కోట్లు నష్టం చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు.

Read: ఎల్జీ పాలిమర్స్ కేసులో ఎన్జీటీ కీలక ఆదేశాలు