AP Curfew: ఏపీ కర్ఫ్యూ వేళల్లో మార్పులు.. నేటి నుంచే అమల్లోకి!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నేటి నుంచి కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు అమల్లోకి వచ్చాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూని సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

AP Curfew: ఏపీ కర్ఫ్యూ వేళల్లో మార్పులు.. నేటి నుంచే అమల్లోకి!

Ap Crefw

Curfew relaxation: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నేటి నుంచి కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు అమల్లోకి వచ్చాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూని సడలిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. సడలింపులు జూన్ 30వ తేదీ వరకు అమల్లో ఉండనున్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి కోసం ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.

ఈ క్రమంలోనే టెస్ట్, ట్రేస్, ట్రీట్, వ్యాక్సీన్, కోవిడ్ నిబంధనలు పాటించడం వంటి చర్యలను పక్కాగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా కరోనా నియంత్రణకై కర్ఫ్యూ కొనసాగించాలని నిర్ణయించింది.

నిన్నటివరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు కర్ఫ్యూ ఉండగా ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో తప్ప రాష్ట్రంలో మిగిలిన చోట్ల కర్ఫ్యూ సడలింపులు జరగనున్నాయి. కోవిడ్‌ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కర్ఫ్యూ సడలింపు ఇదివరకటి లాగే (ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మినహాయింపు) కొనసాగించనున్నారు.

ప్రభుత్వ కార్యాలయాలకు రెగ్యులర్‌ టైమింగ్స్‌ అమలు చేయాలని, ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా మార్పులు చేయాలని నిర్ణయించారు. దుకాణాలను మాత్రం సాయంత్రం 5 గంటలకే మూసి వేయనున్నారు.