Visakha : ఆర్కే బీచ్‌లో సముద్రం ముందుకొచ్చింది…కుంగిన భూమి, పగుళ్లు

ఆర్కే బీచ్ లో సముద్రం ఒక్కసారిగా ముందుకు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. బీచ్ సమీపంలోని ఉన్న పార్క్ వద్ద తీరం కోతకు గురైంది.

Visakha : ఆర్కే బీచ్‌లో సముద్రం ముందుకొచ్చింది…కుంగిన భూమి, పగుళ్లు

Rk Beach

Ramakrishna Beach : విశాఖ ఆర్కే బీచ్ లో అలలు కల్లోలం సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా…ఆర్కే బీచ్ లో సముద్రం ఒక్కసారిగా ముందుకు రావడం..బీచ్ సమీపంలోని ఉన్న పార్క్ వద్ద తీరం కోతకు గురైంది. పార్క్ లో ఉన్న బల్లలు విరిగిపోయాయి. ప్రహారీగోడ కూలిపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. పార్కుకు వచ్చే ప్రాంతాన్ని బారికేడ్లతో మూసివేశారు. చిల్డ్రన్ పార్క్ వైపు సందర్శకులకు అనుమతినివ్వడం లేదు. నోవాటెల్ ముందుభాగంలో బారికేట్లు పెట్టారు.

Read More : Yadadri Temple : యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. వాహనాలు కిందనే నిలిపేస్తున్న అధికారులు

జొవాద్ తుపాన్ కారణంతో సముద్రం ముందుకు వచ్చిందని అధికారులు వెల్లడిస్తున్నారు. సముద్రం ముందుకు వచ్చిందని.. ఆ ప్రాంతంలోని భూమి పగుళ్లు ఏర్పడ్డాయని సమాచారం తెలుసుకున్న అధికారులు అలర్ట్ అయ్యారు. అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సబ్ మెరైన్ ప్రాంతం నుంచి ఆర్కే బీచ్ వరకు కోతకు గురయ్యేది. కానీ..దాదాపు 200 మీటర్ల వరకు కోతకు గురి కావడం ఆశ్చర్యపరుస్తోంది. అలల ఉధృతి తాకిడి ఎక్కువగా ఉంటే…సేఫ్టీ వాల్ పడిపోయే ప్రమాదం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Read More : High Court: రాపిడోకు హైకోర్టు షాక్.. అల్లూ అర్జున్ ప్రకటనలో కత్తిరింపులు

మరోవైపు…ఉత్తరాంధ్రను టెన్షన్ పెట్టిన జొవాద్ తుపాన్ క్రమంగా బలహీపడుతుండడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. జొవాత్ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు తప్పవనే హెచ్చరికలు ఆ ప్రాంత ప్రజలను తెగ టెన్షన్ పెట్టాయి. విశాఖకు సమీపంలోనే తుపాను తీరం దాటుతుందనే అంచనాలు కూడా ఆందోళన రేపింది. అయితే, వాతావరణంలో వచ్చిన మార్పులతో జొవాద్ తుపాను పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఉత్తర దిశగా కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.