Cyclone : ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు

ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు పొంచివుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారి ఉత్తరాంధ్రలోని విశాఖ, ఒడిశాలోని గోపాలపుర్‌ల మధ్య ఈ నెల 26న తీరం దాటే అవకాశాలున్నాయి.

Cyclone : ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు

Cylcone

Cyclone threat to Uttarandhra : ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు పొంచివుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారి ఉత్తరాంధ్రలోని విశాఖ, ఒడిశాలోని గోపాలపుర్‌ల మధ్య ఈ నెల 26న తీరం దాటే అవకాశాలున్నాయి. ఈ తుపానుకు పాకిస్తాన్‌ పెట్టిన ‘గులాబ్‌’ అనే పేరును ఖరారుచేసే అవకాశాలున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న వాయుగుండంగా మారింది.

సాయంత్రం 5.30 గంటలకు తూర్పు-మధ్య బంగాళాఖాతం మీదుగా ఉంది. ఈ వాయుగుండం గోపాలపుర్‌కు ఆగ్నేయంగా 670 కి.మీ దూరంలో, కళింగపట్నానికి తూర్పుగా 740 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఇవాళ ఉదయానికి తుపానుగా మారవచ్చు.

AP Govt: నేడు జిల్లా పరిషత్‌ చైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక!

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా జిల్లాల్లో, ఒడిశాలో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈనెల 26న ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లోనూ పలు చోట్ల భారీ వర్షాలు పడుతాయి.

ఈ నెల 27న ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, తెలంగాణలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఏపీ తీరం వెంట గంటకు 45 కి.మీ నుంచి 90 కి.మీ వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది. కాబట్టి ఈనెల 27వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.