విశాఖలో ఉద్యోగాల పేరుతో డైరీ ఉద్యోగి మోసం… కిడ్నాప్ చేసిన బాధితులు

  • Published By: bheemraj ,Published On : July 11, 2020 / 08:19 PM IST
విశాఖలో ఉద్యోగాల పేరుతో డైరీ ఉద్యోగి మోసం… కిడ్నాప్ చేసిన బాధితులు

విశాఖలో డైరీ ఉద్యోగి కిడ్నాప్ కలకలం రేపింది. కాకినాడు నుంచి రెండు కార్లలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మింది జంక్షన్ వద్ద అగస్టిన్ ను కిడ్నాప్ చేశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కిడ్నాపర్ల కార్లను వెంబడించారు. అగస్టిన్ ను కూర్మనపాలెం దగ్గర అదుపులోకి తీసుకున్నారు. అగస్టిన్ కాకినాడలో ఉద్యోగాల పేరుతో కొంత మంది నిరుద్యోగులను మోసం చేశారు. బాధితులే అగస్టిన్ ను కిడ్నాప్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అగస్టిన్ అనే వ్యక్తి కాకినాడలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ దాదాపుగా 25 మంది యువకుల వద్ద లక్షల కొద్ది డబ్బులు వసూలు చేశాడు. ఈ క్రమంలోనే విశాఖలో తనకు చాలా పరిచయాలు ఉన్నాయి. కేంద్ర పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పారు. ఈ క్రమలో ఎంత మేరకు కూడా ఉద్యోగాలు రాకపోవడం, డబ్బులు అడిగితే తిరిగి ఇవ్వకుండా అగస్టిన్ తప్పించుకుని తిరుగుతున్నాడు.

ఈక్రమంలోనే అగస్టిన్ విశాఖలో ఉన్నాడని తెలుసుకున్న కాకినాడ వాసులంతా కలిసి రెండు కార్లలో అక్కడికి వెళ్లారు. వెళ్లిన తర్వాత అతనితో మాట్లాడించే ప్రయత్నం చేశారు. తమ డబ్బులు ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. అయితే తను డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉన్నానని అగస్టిన్ చెప్పాడు. ఈ నేపథ్యంలో అతన్ని కాకినాడ తీసుకొచ్చేందుకు వారంతా అగస్టిన్ ను వ్యాన్ లో ఎక్కించుకుని మింది నుంచి కాకినాడ వైపు వెళ్తుండగా కూర్మనపాలెం వద్ద అంగన్ పూడి టోల్ గేట్ దగ్గర వీరిని ట్రేస్ చేసి పోలీసులు పట్టుకున్నారు.

కాకినాడుకు చెందిన 11 మంది అగస్టిన్ ను తీసుకెళ్లేక్రమంలో అగస్టిన్ తన ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. తనను కిడ్నాప్ చేస్తున్నారని సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ పదకొండు మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారు మాత్రం తాము కిడ్నాపర్లం కాదని.. ఇతని వద్ద మోసపోయిన బాధితులమన్నారు. తమపై ఎలాంటి కేసులు పెట్టొద్దని కోరారు.