Murder : అప్పడాల కర్రతో అత్తను చంపిన కోడలు

అత్తపెట్టే వేధింపులు భరించలేని కొత్త కోడలు అత్తను అప్పడాల కర్రతో కొట్టి చంపిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

Murder : అప్పడాల కర్రతో అత్తను చంపిన కోడలు

Murder

Murder :  అత్తపెట్టే వేధింపులు భరించలేని కొత్త కోడలు అత్తను అప్పడాల కర్రతో కొట్టి చంపిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తెనాలిలో నివసించే కొడలు ప్రియాంక తన అత్త మైధిలిని తలపై అప్పడాలు, చపాతీలు చేసుకునే కర్రతో బలంగా కొట్టింది. దీంతో అత్త మైధిలి అక్కడికక్కడే మరణించింది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని పరిశీలించారు. అత్త  వేధింపులు భరించ లేకే ఈ హత్యకు పాల్పడినట్లు కోడలు పోలీసులకు చెప్పింది. కేసు నమోదు  చేసుకున్న పోలీసులు అన్నికోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.