విజయవాడ గ్యాంగ్ వార్, మీడియా ముందుకు నిందితులు, రాజకీయ ప్రమేయం లేదు

ఏపీలో సంచలనం రేపిన విజయవాడ గ్యాంగ్ వార్ లో నిందితులను పోలీసులు సోమవారం(జూన్ 8,2020) మీడియా ముందు

  • Published By: naveen ,Published On : June 8, 2020 / 07:14 AM IST
విజయవాడ గ్యాంగ్ వార్, మీడియా ముందుకు నిందితులు, రాజకీయ ప్రమేయం లేదు

ఏపీలో సంచలనం రేపిన విజయవాడ గ్యాంగ్ వార్ లో నిందితులను పోలీసులు సోమవారం(జూన్ 8,2020) మీడియా ముందు

ఏపీలో సంచలనం రేపిన విజయవాడ గ్యాంగ్ వార్ లో నిందితులను పోలీసులు సోమవారం(జూన్ 8,2020) మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ గ్యాంగ్ వార్ కేసుకి సంబంధించిన వివరాలను డీసీపీ హర్షవర్ధన్ మీడియాకు తెలిపారు. ల్యాండ్ సెటిల్ మెంట్ వ్యవహారంలోనే ఇరు వర్గాల(పండు, సందీప్) మధ్య గొడవ జరిగిందన్నారు. సందీప్ ను బెదిరించాలని అనుకున్నారు, కానీ గొడవ జరిగి అతడి చావుకి కారణమైందని డీసీపీ చెప్పారు. కాగా ఈ వ్యవహారంలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని డీసీపీ స్పష్టం చేశారు. గ్యాంగ్ వార్ కేసులో 26మందిని అరెస్ట్ చేశామని, జడ్జి ముందు ప్రవేశపెట్టామని చెప్పారు. వారందరిని రిమాండ్ కు తరలించామన్నారు. మాట్లాడుకునే క్రమంలోనే గొడవ జరిగిందన్నారు. సందీప్ గ్యాంగ్ లోని కిరణ్ అనే వ్యక్తి పండు గ్యాంగ్ లోని వ్యక్తిపై కర్రతో దాడి చేయడం, వారు ఎదురుదాడికి దిగడం, ఇలా గొడవ పెద్దది అయ్యిందన్నారు. పండు తల్లికి క్రిమినల్ హిస్టరీ ఉందని పోలీసులు తెలిపారు. ఈ కేసు విచారణలో ఆమె ప్రమేయం ఉన్నట్టు తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు.

గ్యాంగ్ వార్ లో కొత్త ముఖాలు:
అలాగే బెజవాడ గ్యాంగ్ వార్ కేసులో కొత్త ముఖాలు తెరపైకి వస్తున్నాయి. నాగబాబు అనుచరుడు దాసు ఈ గ్యాంగ్ వార్‌లో పాల్గొన్నాడని పోలీసులు గుర్తించారు. గొడవ జరిగిన తర్వాత దాసు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడికి సంబంధించిన 11మందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే పండు వర్గానికి చెందిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఇప్పుడు సందీప్ వర్గానికి చెందినవారిని అరెస్ట్ చేశారు. మరోవైపు గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి నేడు పండు డిశ్చార్జ్ అయ్యే అవకాశాలున్నాయి. పండు ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారనేది పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.

గ్యాంగ్ వార్ లో సందీప్ మృతి:
మే 31వ తేదీన విజయవాడ నగరంలోని పటమట డొంక రోడ్డులో గ్యాంగ్‌ వార్‌ ఘటనలో మాజీ రౌడీషీటర్‌ సందీప్‌పై మారణాయుధాలతో దాడి జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సందీప్ చనిపోయాడు. యనమలకుదురులో ఓ అపార్ట్‌మెంట్‌కు సంబంధించి పంచాయతీ జరుగుతున్న చోటకు మణికంఠ అలియాస్‌ కేటీఎం పండు రావడం జీర్ణించుచుకోలేకపోయిన సందీప్‌.. అదే రోజు పండుతో ఫోన్‌లో తీవ్రస్థాయిలో హెచ్చరించాడు. పండు కూడా అంతే స్థాయిలో స్పందించడంతో ఫోన్‌లోనే ఇరువురు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడం గ్యాంగ్‌వార్‌కు దారితీసిందని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఆదివారం ఉదయమే పండు ఓ 30 మందికిపైగా యువకుల్ని వెంటేసుకొని వచ్చి పటమట డొంకరోడ్డులోని సందీప్‌ షాప్‌ దగ్గర దాడికి యత్నించగా.. ఆ సమయంలో రహదారిపై బ్లూకోట్స్‌ సిబ్బంది సైరన్‌ మోగిస్తూ రావడంతో చాలామంది పోలీసులు వస్తున్నారని అక్కడి నుంచి పారిపోయారు. పరస్పర సవాళ్ల నేపథ్యంలో సాయంత్రం చర్చి వెనుక ఉన్న ఖాళీ స్థలానికి చేరుకుని ఒకరిపై ఒకరు రాడ్లు, కత్తులు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో సందీప్ చనిపోయాడు. గాయాలతో పండు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ గ్యాంగ్ వార్ వెనుక రాజకీయ హస్తం ఉందనే వార్తలు వచ్చాయి.

* మొత్తం వివాదానికి కారణం ల్యాండ్ ఓనర్స్ శ్రీధర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి
* డీల్ కుదిర్చిన నాగబాబును విచారిస్తున్న పోలీసులు
* ల్యాండ్ సెటిల్మెంట్ లో నాగబాబు అనుచరుడు దాస్ కీలకపాత్ర
* బెజవాడ్ గ్యాంగ్ వార్ లో సందీప్ వర్గంలోని ఇద్దరు అరెస్ట్
* పోలీసుల అదుపులో మంగళగిరికి చెందిన రౌడీషీటర్లు

Read: జగన్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, సాక్ష్యం ఇదే