ఏపీలో TV ఛానల్ ద్వారా పాఠాలు..ఏ ఛానల్ లో తెలుసా

  • Published By: madhu ,Published On : June 10, 2020 / 03:53 AM IST
ఏపీలో TV ఛానల్ ద్వారా పాఠాలు..ఏ ఛానల్ లో తెలుసా

ఏపీలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థులకు నష్టం కలగకుండా, విద్యా బోధనకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు 2020, జూన్ 10వ తేదీ నుంచి టీవీ ఛానల్‌ ద్వారా పాఠాలు బోధించనున్నారు. 1 వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దూరదర్శన్‌ సప్తగిరి ఛానల్‌ ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా 1 నుంచి 5 తరగతులకు బ్రిడ్జి కోర్సు, 6 నుంచి 9 తరగతులకు సబ్జెక్టు పాఠాలను బోధిస్తారు. విద్యార్థులకు వచ్చే సందేహాలను నివృత్తి చేసేందుకు టీచర్లు వారానికోసారి స్కూల్‌కు వస్తారు. ఆన్‌లైన్‌ పాఠాలపై విద్యార్థులకు ఏవైనా సందేహాలు ఉంటే ఆ రోజుల్లో స్కూల్‌కి వచ్చి నివృత్తి చేసుకోవచ్చు. అంతేకాదు.. 5వ తరగతి వరకు విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్రిడ్జి కోర్సు పుస్తకాలను‌ అందిస్తారు. ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, తెలుగు సబ్జెక్టులను ఇంగ్లిష్‌ మీడియంలో బోధిస్తారు.

1, 2 తరగతులకు ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటలు. 
3, 4, 5 తరగతులకు 11.30 గంటల నుంచి 12 గంటల వరకు. 
6 నుంచి 9 తరగతులకు అన్ని సబ్జెక్టులు చెబుతారు. 
6, 7 తరగతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు. 

8, 9 తరగతులకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. 
1- నుంచి 5 క్లాసెస్ చెప్పే వారు ఈ నెల 16 నుంచి ప్రతి మంగళవారం పాఠశాలకు హాజరు కావాలి. 
6 నుంచి 7 తరగతుల HM టీచర్స్ 17వ తేదీ నుంచి ప్రతి బుధవారం పాఠశాలకు వెళ్లాలి. 
8 నుంచి 9 తరగతులకు పాఠాలు చెప్పే టీచర్స్ 19 నుంచి ప్రతి శుక్రవారం హాజరు కావాలి. 
10వ తరగతి ఉపాధ్యాయులు ప్రతి బుధవారం, శుక్రవారం స్కూళ్లకు వెళ్లాల్సి ఉంటుంది.