అమరావతిలో అప్పుడే ఎందుకు కొన్నావ్ పయ్యావుల – మంత్రి బుగ్గన

10TV Telugu News

అమరావతిలో ఆస్తుల కొనుగోలు విషయంలో ప్రధాన ప్రతిపక్షం, ప్రతిపక్షం మధ్య మాటల తూటాలు పేలాయి. తాము భూములు ఎప్పుడు కొనుగోలు చేశామో చెప్పుకొస్తున్నారు. దీనికి ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది. ఆనాడు జరిగిన ఏపీ కేబినెట్ ఏ నిర్ణయం తీసుకొందో వివరిస్తున్నారు. మూడు రాజధానుల అంశంపై 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా జరిగిన సమావేశంలో పయ్యావుల ఆస్తుల వివరాలను మంత్రి బుగ్గన చదివి వినిపించారు.  

దీనికి పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. తాను 4 వేల 800 గజాల భూమి కొనడం జరిగిందని, రాజధాని ప్రకటన అనంతరం భూమి కొనుగోలు చేయడం జరిగిందన్నారు. దీనిపై మంత్రి బుగ్గన జోక్యం చేసుకున్నారు. తప్పుడు సమాచారం ఇస్తే..జోక్యం చేసుకోవాల్సి వస్తోందన్నారు.

 

2014, సెప్టెంబర్ 01వ తేదీన జరిగిన కేబినెట్ మీటింగ్..లో విజయవాడ చుట్టూ రాజధాని వస్తుందని, మూడు పెద్ద నగరాలు, 14 స్మార్ట్ నగరాలు అని ల్యాండ్ పూలింగ్ సిస్టం ద్వారా..కేబినెట్ సబ్ కమిటీ అని చెప్పడం జరిగిందన్నారు. బినామీల లెక్కలు తేల్చడం అంత ఈజీ కాదన్నారు. పయ్యావుల కుటుంబసభ్యుల పేరిట భూమి ఉందా ? లేదా ? అని నిలదీశారు. 

పయ్యావుల విక్రమ సింహ ఇక్కడ భూములు కొనలేదా అని నిలదీశారు మంత్రి బుగ్గన. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగే..ఇక్కడ భూములు కొన్నారని గుర్తు చేశారు. CRDA బిల్లు ఆమోదం తర్వాతే..గ్రామాలను నోటిఫై చేశారన్నారు. 

కేబినెట్ నిర్ణయం అనంతరం పల్లెల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను పర్యటించి రైతులను ఒప్పించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఏ ఏ ప్రాంతాలనే దానిపై 07-10-2014లో వార్తలు వచ్చాయని, ఇక్కడే ఎందుకు కొన్నారని ప్రశ్నించడం సరికాదని, చివరకు ప్రజలే నిర్ణయిస్తారని పయ్యావుల వెల్లడించారు. 

Read More : అమరావతిలో 4 వేల 800 ఎకరాలు కొన్నా – పయ్యావుల

×