TTD And Kishkinda Sansthan : హనుమంతుని జన్మస్థలం..చర్చల్లో ప్రతిష్టంభన

హనుమంతుని జన్మస్థలంపై హాట్ హాట్ గా చర్చలు కొనసాగుతున్నాయి. టీటీడీ - హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధారాల్లో పలు తప్పులను గోవిందానంద సరస్వతి ఎత్తి చూపారు. టీటీడీ పూర్తిస్థాయిలో నివేదిక అందిస్తే..మరిన్ని తప్పులు చూపిస్తానంటున్నారు గోవిందానంద సరస్వతి.

TTD And Kishkinda Sansthan : హనుమంతుని జన్మస్థలం..చర్చల్లో ప్రతిష్టంభన

Maruthi

Hanuman Birthplace : హనుమంతుని జన్మస్థలంపై హాట్ హాట్ గా చర్చలు కొనసాగుతున్నాయి. టీటీడీ – హనుమత్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధారాల్లో పలు తప్పులను గోవిందానంద సరస్వతి ఎత్తి చూపారు. టీటీడీ పూర్తిస్థాయిలో నివేదిక అందిస్తే..మరిన్ని తప్పులు చూపిస్తానంటున్నారు గోవిందానంద సరస్వతి. నివేదిక ఇవ్వడం కుదరదని టీడీపీ తేల్చిచెబుతోంది. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది.
హనుమంతుడి జన్మస్థలంపై కొనసాగుతోన్న వివాదం ఇప్పటిది కాదు.

ఇలాంటి పరిస్థితుల మధ్య తిరుమలే.. ఆంజనేయుడి జన్మస్థలమని నాలుగు ఆధారాలు ప్రకటించింది టీటీడీ. దీంతో వ్యవహారం కొత్త టర్న్ తీసుకుంది. టీటీడీ ప్రకటనపై కర్ణాటకకు చెందిన హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హనుమంతుని జన్మస్థలంపై హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తో చర్చకు టీటీడీ రెడీ అయింది. గురువారం తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో హనుమంతుని జన్మ స్థలంపై ఇరు పక్షాల మధ్య చర్చలు జరిగాయి. కిష్కింద ట్రస్ట్ తరుపున చర్చలో శ్రీ గోవిందానంద సరస్వతి పాల్గొన్నారు.

టీటీడీ తరుపున చర్చలో కమిటీ కన్వీనర్, సభ్యులు పాల్గొన్నారు. శ్రీరామనవమి రోజున తిరుమలలోని అంజనాద్రిని హనుమంతుని జన్మస్థలంగా టీటీడీ ప్రకటించింది. దానిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ టీటీడీకి లేఖలు రాసింది. బహిరంగ చర్చకు రావాలంటూ టీటీడీకి సవాలు చేసింది. హనుమద్ జన్మభూమి తీర్థ ట్రస్టు సవాల్ కు స్పందించింది. టీటీడీ. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
Read More : Dead Bodies: దేవరకద్ర గుట్టపై మూడు మృతదేహాలు కలకలం