Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు .. దేశ వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో దాడులు

ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో ఈడీ దాడుల్లో దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది.

Delhi Liquor Scam :  ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు .. దేశ వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో దాడులు

Delhi Liquor Scam

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో ఈడీ దాడుల్లో దూకుడు పెంచింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో చాలామంది పలు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ దాడుల్ని కొనసాగిస్తోంది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. ఢిల్లీతోపాటు పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని ఆయా ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారులు 25 బృందాలుగా ఏర్పడి బెంగళూరు, చెన్నై, నెల్లూరు, హైదరాబాద్‌లోని పలువురి ఇండ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ట్విస్ట్.. ఎమ్మెల్సీ కవిత ఫొటోపై రాజకీయ దుమారం

మద్యం పాలసీ కేసులో (సీబీఐ) దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. దీంట్లో భాగంగా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రల్లో 40 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. మూడు నెలల క్రితం మనీలాండరింగ్‌ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ విచారణ సందర్భంగా సత్యేంద్ర తెలిపిన సమాచారం మేరకు లిక్కర్‌ స్కామ్‌లో అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ఆగస్టులో కూడా వివిధ ప్రాంతాల్లో ఈడీ దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఢిల్లీ,హైదరాబాద్, నెల్లూరు,బెంగళూరు, మంగళూరు, చెన్నైలలో ఈడి సోదాలు నిర్వహించింది.

Delhi liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 16మందిపై కేసు నమోదు..ఏ14గా రామచంద్ర పిళ్లై

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 40 చోట్ల మరోసారి సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరు, చెన్నై, ఏపీలోని నెల్లూరులో తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని రాయదుర్గం సహా పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్లీకి చెందిన ఈడీ అధికారుల ఆధ్వర్యంలో 25 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి ఈడీ అధికారులు ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు సార్లు తనిఖీలు నిర్వహించారు. దీంట్లో భాగంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో కూడా మూలాలు ఉన్నాయనే ఆరోపణలతో ఏపీ, తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ, లిక్కర్ వ్యాపార వేత్తల నివాసాలు కార్యాలయాల్లో ఈడి సోదాలు. కొనసాగుతున్నాయి.

Manish Sisodia: నాపై తప్పుడు కేసు పెట్టేలా ఒత్తిడి తేవడం వల్లే సీబీఐ అధికారి ఆత్మహత్య: మనీష్ సిసోడియా

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నగర శివారలోని కోకాపేట్‌లోని రామచంద్ర పిళ్లై నివాసం, నానక్‌రామ్‌గూడలోని రాబిన్‌ డిస్టలరీస్‌ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. రాబిన్‌ డిస్టలరీస్‌, రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పేరుతో రామచంద్ర పిళ్ల్లై కంపెనీలు నిర్వహిస్తున్నారు. తన సంస్థలో అభిషేక్‌ బోయిన్‌పల్లి, గండ్ర ప్రేమ్‌సాగర్‌రావును డైరెక్టర్లుగా ఆయన నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి హైదరాబాద్‌లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అయితే ఈ సోదాలపై ఈడీ ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు. కాగా.. లిక్కర్ పాలసీ విషయంలో అవినీతి ఆరోపణలు,ఢిల్లీ ఎల్జీ ఆమోదం తెలపకపోవడంతో ప్రస్తుతం లిక్కర్ పాలసీని వెనక్కి తీసుకుంది ఢిల్లీ ప్రభుత్వం.