Cyclone : తీరాన్ని తాకిన వాయుగుండం… ఏపీ, తమిళనాడులో విస్తారంగా వర్షాలు.. వారికి సెలవులు రద్దు

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారైక్కల్, శ్రీహరికోట మధ్య చెన్నైకి సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడు, ఏపీ దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు..

Cyclone : తీరాన్ని తాకిన వాయుగుండం… ఏపీ, తమిళనాడులో విస్తారంగా వర్షాలు.. వారికి సెలవులు రద్దు

Landfall

Cyclone : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారైక్కల్, శ్రీహరికోట మధ్య చెన్నైకి సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తర తమిళనాడు, ఏపీ దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ప్రస్తుతం చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలను ఈ రెండు జిల్లాలకు తరలించారు. తిరుపతి పట్టణం జలమయం అయింది. తిరుమల కొండపైనా ఈ మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. చిత్తూరు జిల్లాలో నదులు ఉప్పొంగుతున్నాయి.

Wi-Fi HaLow : సరికొత్త వై-ఫై టెక్నాలజీ వస్తోంది.. కిలోమీటర్ దూరంలోనూ Wi-Fi కనెక్ట్ కావొచ్చు!

ఈ సాయంత్రం తీరం దాటిన వాయుగుండం క్రమంగా బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. చెన్నైలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయంటూ జారీ చేసిన హెచ్చరికను ఐఎండీ సవరించింది. భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికగా మార్పు చేసింది. తమిళనాడులోని ఇతర జిల్లాల్లోనూ రేపటి నుంచి వర్షాలు తగ్గుముఖం పడతాయని వెల్లడించింది.

ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో ఏపీ, తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.

తమిళనాడులో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన అధికారులు.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటివరకు కురిసిన భారీ వర్షాల కారణంగా తమిళనాడులో 14 మంది మరణించారు. చెన్నై నగరంలో ఇప్పటికీ నీరు తొలగిపోలేదు. ఎక్కడ చూసినా రోడ్లపై నీరు నిలిచి ఉంది.

WhatsApp: మీ వాట్సాప్‌లో చాట్‌ డిలీట్ అయిందా? ఇలా రికవరీ చేసుకోవచ్చు!

బంగాళాఖాతంలో తుపాను ఏపీలోని పలు జిల్లాలను వణికిస్తోంది. తుపాను తీరం దాటగా బలమైన గాలులు, వర్షాలు కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేసింది ప్రభుత్వం. ప్రజలు విద్యుత్ లైన్లకు దూరంగా ఉండాలని, స్తంభాలు పడిపోవడం, లైన్లు తెగిపోవడం జరిగినట్లు అయితే సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులకు లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1912కు ఫోన్ చేసి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేసింది.