నారా భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదు

అమరావతి రాజధాని కోసం చేస్తున్న ఉద్యమానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి తన గాజులను విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. రైతులకు పూర్తి మద్దతుగా మా

  • Published By: veegamteam ,Published On : January 2, 2020 / 10:30 AM IST
నారా భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదు

అమరావతి రాజధాని కోసం చేస్తున్న ఉద్యమానికి టీడీపీ చీఫ్ చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి తన గాజులను విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. రైతులకు పూర్తి మద్దతుగా మా

అమరావతి రాజధాని కోసం చేస్తున్న ఉద్యమానికి సాయంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి తన గాజులను విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. రైతులకు పూర్తి మద్దతుగా మా కుటుంబం అండగా ఉంటుందని ఆమె చెప్పారు. కాగా, భువనేశ్వరి గాజుల విరాళంపై డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి విమర్శలు చేశారు. భువనేశ్వరి ఇవ్వాల్సింది గాజులు కాదు.. ఆమె భర్త అన్యాయంగా తీసుకున్న భూములు అని అన్నారు. రాజధాని‌లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో భూములు కొట్టేసింది మీ భర్త కాదా అని భువనేశ్వరిని ప్రశ్నించారు మంత్రి పుష్పశ్రీవాణి.

హెరిటేజ్ పేరుతో రాజధానిలో ఉన్న భూములపై భువనేశ్వరి లెక్కలు చెప్పాలని డిప్యూటీ సీఎం డిమాండ్ చేశారు. హెరిటేజ్ పేరుతో ఉన్న 14 ఎకరాల భూములను రైతులకు ఇచ్చేయాలన్నారు. టీడీపీ నేతలు 4వేల ఎకరాలు దోచుకున్నది నిజం కాదా? అని ఆమె నిలదీశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదన్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి.. చంద్రబాబు, భువనేశ్వరి ఈ ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకమా? అని అడిగారు.

తన భార్య భువనేశ్వరితో కలిసి బుధవారం(జనవరి 1,2020) రాజధాని గ్రామాల్లో చంద్రబాబు పర్యటించారు. రాజధాని కోసం పోరాటం చేస్తున్న రైతులను, ప్రజలను కలిశారు. రాజధాని కోసం చేస్తున్న ఆందోళనలకు మద్దతు తెలిపారు. జగన్ కు ఓటు వేయొద్దని తాను ఎంత చెప్పినా వినకుండా.. జగన్ ని అధికారంలోకి తీసుకొచ్చారని.. ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడని.. ప్రజలు, రైతులకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే అమరావతిని రాజధానిగా చేశామన్నారు. ఈ నిర్ణయాన్ని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు కూడా స్వాగతించారని చంద్రబాబు గుర్తు చేశారు. అమరావతి రాజధానిగా నాడు జగన్ కూడా అంగీకారం తెలిపారని చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక జగన్ యూటర్న్ తీసుకున్నారని.. 3 రాజధానుల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.

ఏపీని ప్రథమ స్థానంలోకి తీసుకురావడానికి చంద్రబాబు నిరంతర కృషి చేశారని భువనేశ్వరి అన్నారు. ప్రజల తర్వాతే.. నన్ను, కుటుంబాన్ని పట్టించుకునేవారని చెప్పారు. నిత్యం రైతులకు మా కుటుంబం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Also Read : విశాఖలో కేపిటల్ పెట్టినా బాగుపడేది చంద్రబాబు సామాజిక వర్గమే : మంత్రి బొత్స