Devaragattu: నివురుగప్పిన నిప్పులా దేవరగట్టు.. నేడే కర్రల సమరం

బన్ని ఉత్సవం.. కర్రల సమరం కోసం దేవరగట్టు సిద్ధమైంది. కర్నూలు జిల్లాలో ప్రతీ ఏడాది దసరా పండుగను పురస్కరించుకుని మాత మాళమ్మకు, మల్లేశ్వరునికి కళ్యాణం అర్థరాత్రి నిర్వహిస్తారు.

Devaragattu: నివురుగప్పిన నిప్పులా దేవరగట్టు.. నేడే కర్రల సమరం

Devara (1)

Devaragattu village: బన్ని ఉత్సవం.. కర్రల సమరం కోసం దేవరగట్టు సిద్ధమైంది. కర్నూలు జిల్లాలో ప్రతీ ఏడాది దసరా పండుగను పురస్కరించుకుని మాత మాళమ్మకు, మల్లేశ్వరునికి కళ్యాణం అర్థరాత్రి నిర్వహిస్తారు. అనంతరం
వేల సంఖ్యలో రింగులు తొడిగిన కట్టెలతో.. అగ్గి జివిటీలుతో దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి జైత్రయాత్రగా కొనసాగుతారు భక్తులు.

డిర్ర్‌..ర్ర్‌…గోపరక్‌…బహుపరాక్‌ అంటూ కర్రల సమరంలో 11గ్రామాల ప్రజలు పాల్గొంటారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వేలాదిగా ఉత్సవం చూసేందుకు తరలివస్తారు. సంప్రదాయమా? అని ప్రశ్నించే వారు ఉన్నారు. కరోనా కారణంగా దేవరగట్టుకు బయటివారిని మాత్రం అనుమతించట్లేదు పోలీసులు. ఉత్సవంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 1,350 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఐరన్ తొడిగిన కట్టెలు అగ్గిజీవిటితో రాకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు.

అల్లర్లకు పాల్పడే ఆకతాయిలను గుర్తించేందుకు వీలుగా 120కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు అధికారులు. నాలుగు డ్రోన్‌ కెమెరాలతో కూడా పర్యవేక్షిస్తున్నారు. వేడుకల్లో గాయపడే భక్తుల కోసం దేవరగట్టులోని ఓ భవనంలో హెల్త్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో 10 మంది డాక్టర్లు, 100 మంది వైద్య సిబ్బంది సేవలు అందించబోతున్నారు.

సారా దొరకకుండా అధికారులు చర్యలు తీసుకుంటే మాత్రం కర్రల సమరం కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని అభిప్రాయపడుతున్నారు అక్కడి యువకులు. నాటుసారా, మద్యం సేవించిన వారి చేతిలోని కర్రలు ఆధీనంలో లేకపోవడం వల్లే గాయాలు అవుతున్నాయని, కొందరు ఉద్దేశ పూర్వకంగా కూడా గుంపులో చేరి కొట్టేందుకు ప్రయత్నించేవారని, ఇది రక్తపాతానికి కారణమయ్యేదని అధికారులు చెబుతున్నారు.