Devineni Uma : క్యాసినో వివాదం.. కొడాలి నాని మంత్రి పదవికి రాజీనామా చేయాలి

క్యాసినో వివాదంపై సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి ఎందరో మహానుభావులు గుడివాడ నుంచి వస్తే.. ఈరోజు గుడివాడను ఒక గోవా చేశారని వాపోయారు.

Devineni Uma : క్యాసినో వివాదం.. కొడాలి నాని మంత్రి పదవికి రాజీనామా చేయాలి

Devineni Uma

Devineni Uma : గుడివాడ క్యాసినో వివాదంలో మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. మంత్రి కొడాలి నాని.. గుడివాడకు.. గోవా సంస్కృతిని తీసుకొచ్చారని మండిపడ్డారు. క్యాసినో వివాదంపై సీఎం జగన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రూ.500 కోట్ల జూదం జరిగితే సీఎంకి బాధ్యత లేదా? అని అడిగారు. మొదటి సంవత్సరం ఎడ్ల పందాలకు సీఎం జగన్ గుడివాడకు వచ్చారని దేవినేని ఉమా అన్నారు.

Omicron Patient : ఒమిక్రాన్‌ పేషెంట్లకు డెల్టా వేరియంట్ సహా ఇతర హానికారక వేరియంట్లను నాశనం చేసే శక్తి

ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి ఎందరో మహానుభావులు గుడివాడ నుంచి వస్తే.. ఈరోజు గుడివాడను ఒక గోవా చేశారని వాపోయారు. గుడివాడలో గంజాయి, డ్రగ్స్, మహిళలు, గుట్కా, మట్కా విచ్చలవిడితనం అయిపోయాయని ఆరోపించారు. ప్రతి ఇంట్లో కూడా గుడివాడ క్యాసినో గురించి మాట్లాడుతున్నారని దేవినేని ఉమ అన్నారు. 27 ఎకరాల లేఔట్ల ప్రాంగణంలో పెద్ద ఎత్తున జూదం జరిగితే శాసనసభ్యుడిగా, మంత్రిగా నీకు బాధ్యత లేదా? అని కొడాలి నానిని ప్రశ్నించారు.

Richest Rich KID: తొమ్మిదేళ్ల కుర్రాడికి విలాసవంతమైన భవనం, ప్రైవేట్ జెట్, సూపర్ కార్స్

సన్న బియ్యం ఇస్తానని చెప్పి క్యాసినో ఆడించారని ధ్వజమెత్తారు. కొడాలి నానికి ఏ మాత్రం సిగ్గున్నా వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలన్నారు. కేంద్ర సంస్థలు అన్నీ కూడా ఈ క్యాసినో బాగోతంపై స్పందించాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు.. వైసీపీ ప్రభుత్వం అనడం లేదని.. క్యాసినో ప్రభుత్వం అంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కాళ్లు పట్టుకుని రెండుసార్లు ఎమ్మెల్యేగా అయ్యి పార్టీ మారి మంత్రి అయిన 32 నెలలకే ఇంతా అహంకారమా? అంటూ కొడాలి నానిపై విరుచుకుపడ్డారు.