Tirupati Gangamma Jathara 2023 : తోటి వేషాలతో గంగమ్మను దర్శించుకున్న భక్తులు .. విచిత్ర వేషాల వెనుక చరిత్ర ఇదే..

‘తోటి వేషం’ గంగమ్మను దర్శించుకుంటున్నారు భక్తులు.చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తోటి వేషం ధరించి అమ్మవారి సేవలో తరిస్తున్నారు. అమ్మవారి జాతరలో తోటివేషం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కులమతాలకు సంబంధం లేకుండా కోరికలు నెరవేరిన వారు ప్రత్యక వేషాలతో అమ్మను దర్శించుకుంటారు. ఈ విచిత్ర వేషాల వెనుక ఉన్న చరిత్ర ఏంటో తెలుసా?

Tirupati Gangamma Jathara 2023 : తోటి వేషాలతో గంగమ్మను దర్శించుకున్న భక్తులు .. విచిత్ర వేషాల వెనుక చరిత్ర ఇదే..

Tirupati Gangamma Jathara 2023

Tirupati Gangamma Jathara 2023 : తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈరోజు మూడవరోజు. ఈరోజు గంగమ్మ జాతరలో ప్రత్యేకత ఏమిటంటే భక్తులు ధరించే ‘తోటి వేషం’. జాతరలో మూడో రోజు భక్తులు తోటివేషం ధరించి అమ్మవారిని దర్శించుకున్నారు. పొంగళ్లు, అంబలి సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తోటి వేషం ధరించి అమ్మవారి సేవలో తరిస్తున్నారు. అమ్మవారి జాతరలో తోటివేషం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కులమతాలకు సంబంధం లేకుండా కోరికలు నెరవేరిన వారు ప్రత్యక వేషాలతో అమ్మను దర్శించుకుంటారు.

బొగ్గు పొడిని ఒళ్ళంతా పూసుకుని.. తెల్లనామం సాది కనుబొమ్మలపైన చుక్కబొట్లు పెట్టుకుని… వేపాకు మండలను కట్టుకుని బూతులు తిడుతూ సంచరిస్తే గంగమ్మ పరవశించి తమ కోర్కెలు తీరుస్తుందని భక్తుల విశ్వాసం. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

పల్లవరాజుల కాలంలో గంగమ్మకు ఆలయాన్ని నిర్మించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. బ్రహ్మాండనాయకుడు..కలియుగదైవంగా విరాజిల్లుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామి చెల్లెలుగా పిలువబడుతున్న గంగమ్మకు తొమ్మిది వందల ఏళ్ల క్రితం నుంచి జాతర నిర్వహిస్తున్నారు. ఆనాటి స్థానిక ఆచారాల ప్రకారమే గంగమ్మకు జాతర నిర్వహిస్తున్నారు. అదే ఆచారాలతో ఈనాటికి ప్రభుత్వం ఈ వేడుకలను నిర్వహిస్తోంది.

Tirupati Gangamma Jathara: చాటింపుతో వైభవంగా ప్రారంభమైన తిరుపతి గంగమ్మ జాతర.. వేరే ఊరోళ్లు రాత్రి ఉండొద్దు..

విచిత్ర వేషాల వెనుకున్న చరిత్ర..
తాతయ్యగుంట గంగజాతరతో వింత వేషాలు ప్రత్యేకమైనవి. ఈ వేషాల వెనుక ఓ చరిత్ర ఉంది. తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే కాలంలో, ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను అత్యాచారం చేసేవాడని..కొత్తగా పైళ్లెన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలని ఆంక్షలు విధించాడని.. దాంతో, ఆ పాలెగాడిని అంతమొందించి మహిళలను కాపాడేందుకు గంగమ్మ తిరుపతికి రెండు కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో జన్మించిందని చెబుతారు.

అలా ఆ కామాంధుడు యుక్తవయసుకు వచ్చిన గంగమ్మపై కూడా కన్నేసాడట. ఆమె సామాన్యమహిళే అని మోహించాడు. చెరబట్టాలనుకున్నాడు. కానీ గంగమ్మ విశ్వరూపం చూపించటంతో భయపడి పారిపోయాడట. అలా పారిపోయి దాక్కున్న వాడిని గంగమ్మ వెతుకుతూ, రకరకాల మారు వేషాలు ధరించి మూడు రోజులపాటు వెతికిందట. అలా మారువేషంలో భాగంగా మొదటి రోజు బైరాగి వేషం, రెండో రోజు బండ వేషం, మూడో రోజు తోటి వేషాలు వేసినా పాలెగాడు కనిపించలేదట.

దీంతో ఎలాగైనా వాడిని పట్టుకోవాలనుకున్న గంగ్మ్మ నాలుగో రోజు దొరవేషం వేసిందట. దాంతో తన దొరే వచ్చాడునుకుని బయటకొచ్చాడా పాలెగాడు. వెంటనే అతడిని చంపి గంగమ్మ దుష్టశిక్షణ చేసిందని భక్తులు నమ్ముతున్నారు.. గంగమ్మ ఆరోజు చేసిన దుష్టశిక్షణకు గుర్తుగా ఈ రోజుకూ తిరుపతి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ జాతర చేస్తున్నారు.

చాటింపుతో మొదలవుతుంది గంగమ్మ జాతరలో ఒక ప్రత్యేక ఉంది. వారం రోజుల పాటు జరిగే ఈ జాతర నేపథ్యంలో గ్రామస్తులు ఊరును విడిచి వెళ్లకూడదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు రాత్రిపూట ఇక్కడ బస చేయకుండా వెళ్లిపోవాలి. జాతర ప్రారంభం కావడంతో అమ్మవారి అనుగ్రహం పొందేందుకు పూజలు నిర్వహించాలి.. ఇలా సంప్రదాయాల ప్రకారం కైకాల వంశస్తులు తిరుపతి గంగజాతర సందర్భంగా మంగళవారం గ్రామంలో చాటింపు వేశారు. అనంతరం భేరి వీధిలో తొలి చాటింపు పూజ నిర్వహించి నాటి నగర శివారు ప్రాంతాలలో అష్టదిగ్భంధనం చేసి చాటింపుతో జాతరకు శ్రీకారం చుట్టారు.