Tirumala Devotees Rush : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వెంకన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల భక్త జన సంద్రంగా మారింది. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది.

Tirumala Devotees Rush : తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30గంటల సమయం

Tirumala Devotees Rush : తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వెంకన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో తిరుమల భక్త జన సంద్రంగా మారింది. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. శిలాతోరణం వరకు భక్తులు క్యూలైన్ లో వేచి ఉన్నారు. పెరటాసి మాసం మూడో శనివారం కావడం తమిళనాడు భక్తులు.. దానికి తోడు వరుస సెలవులు కావడంతో ఇతర రాష్ట్రాల భక్తులు తిరుమలకు క్యూ కట్టారు. బుధవారం మధ్యాహ్నం నుంచి రద్దీ బాగా పెరిగింది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణగిరి ఉద్యానవనాల్లోని అన్ని షెడ్లు భక్తులతో నిండాయి.

పెరటాసి నెల కావడంతో తిరుమలకు తమిళనాడు భక్తులు క్యూ కట్టారు. అదే సమయంలో దసరా సెలవులు ఉండటంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. నిన్నటివరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాలు ముగిసినప్పటి నుంచి భక్తుల రద్దీ అనూహ్యంగా ఏర్పడింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

పెరటాసి మాసంలో మూడో శనివారాన్ని అత్యంత పవిత్రంగా తమిళనాడు భక్తులు భావిస్తారు. ఆ రోజున స్వామి వారిని దర్శనం చేసుకుంటే దైవ కృపకు పాత్రులు అవుతామనే నమ్మకం భక్తుల్లో ఉంది. దీంతో తమిళనాడు నుంచి భక్తులు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండాయి. నారాయణగిరి ఉద్యాన వనంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లు కూడా నిండిపోయాయి. దీంతో శిలాతోరణం వరకు కొత్తగా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అవి కూడా భక్తులతో నిండిపోయాయి.

క్యూలైన్ లో వేచి ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి 30 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో.. తమకు సహకరించాలని.. అందుకు సిద్ధమైతేనే తిరుమలకు రావాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది టీటీడీ. కాగా, భక్తుల రద్దీ దాదాపు వారం, 10 రోజులపైనే కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేశారు.