TDP YCP : బెంజ్ సర్కిల్ లో వంశీని బట్టలు లేకుండా నిలబెడతాం- టీడీపీ

ఐక్యరాజ్య సమితి, అమెరికా అధ్యక్షుడిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తే బాగుంటుంది అని వల్లభనేని వంశీ అన్నారు. 

10TV Telugu News

TDP YCP : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ మంటలు రేపుతోంది. విజయవాడ జిల్లా వైసీపీ, టీడీపీ నేతలు కౌంటర్లు, ఎన్ కౌంటర్లతో రెచ్చిపోతున్నారు. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

Read This :  TDP : పట్టాభికి బెయిల్.. పోలీసులు ఓవరాక్షన్ తగ్గించుకోవాలన్న కోర్టు

చంద్రబాబు, లోకేశ్ లపై పదే పదే ఆరోపణలు ఎక్కుపెడుతున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ … ఐ టీడీపీ పేరుతో తనను, తన కుటుంబాన్ని కించపరిచే విధంగా ఇష్టం వచ్చినట్లు టీడీపీ ట్రోలింగ్ చేయిస్తోందన్నారు. “ఎన్టీఆర్‌పై చెప్పులు, అమిత్ షాపై రాళ్లు వేయించిన ఘనత చంద్రబాబుది. నేను మీకు ఒక లెక్కా. ఘర్షణల ద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూసే వ్యక్తి చంద్రబాబు. కాపు ఉద్యమం చేసిన ముద్రగడ కుటుంబాన్ని కొట్టి బూతులు తిట్టించాడు. ఐ టీడీపీ పెట్టి మాపై విష ప్రచారం చేయిస్తున్నారు. నన్ను ఓడించినా.. గెలిపించినా నా నియోజకవర్గ ప్రజలు చేస్తారు. రాజీనామా చేస్తాను.. నాపై చంద్రబాబు లేదా లోకేష్ పోటీ చెయ్యాలి. పరిటాల సునీత వచ్చి ఓడించాలి. ఐక్యరాజ్య సమితి, అమెరికా అధ్యక్షుడిని కూడా కలిసి ఫిర్యాదు చేస్తే బాగుంటుంది” అని వల్లభనేని వంశీ అన్నారు.

Read This : YS Jagan on TDP: టీడీపీపై జగన్ సీరియస్.. కావాలని రెచ్చగొడుతున్నారన్న ఏపీ సీఎం!

దీనికి కౌంటర్ ఇచ్చారు కృష్ణా జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. వల్లభనేని వంశీని విశ్వాసఘాతకుడన్నారు. “వంశీది కృష్ణా జిల్లా అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. కృష్ణా జిల్లా అడపడుచులను కించపరిచే విధంగా వంశీ కామెంట్స్ ఉన్నాయి. చంద్రబాబు భిక్షతో గన్నవరంలో వంశీ ఎమ్మెల్యే అయ్యాడు. అడబిడ్డలు తలదించుకునేలా మాట్లాడిన వంశీకి అమ్మవారి శాపం తగులుతుంది. కృష్ణా జిల్లా మంత్రులతో వంశీ ప్రతిరోజు ఇంట్లో రాత్రి వేళల్లో ఏమి చేస్తాడో ప్రజలకు తెలుసు. త్వరలో బెంజ్ సర్కిల్లో బట్టలు లేకుండా వంశీని నిలబెట్టే రోజు వస్తుంది. వంశీ ఇంట్లో ప్రతి రోజు కృష్ణా జిల్లా మంత్రులు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు” అని సీరియస్ ఆరోపణలు చేశారు కొల్లు రవీంద్ర.