Palnadu District : ఇదేందయ్యా ఇది..! పల్నాడు జిల్లాలో ప్రేతాత్మ‎కు పెన్షన్.. ఏకంగా 12ఏళ్లుగా పించన్ ఇస్తున్న వైనం.. అసలేం జరిగిందంటే..

Palnadu District : 12ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికి ఇంకా వృద్దాప్య పెన్షన్ అందుతోంది.

Palnadu District : ఇదేందయ్యా ఇది..! పల్నాడు జిల్లాలో ప్రేతాత్మ‎కు పెన్షన్.. ఏకంగా 12ఏళ్లుగా పించన్ ఇస్తున్న వైనం.. అసలేం జరిగిందంటే..

Palnadu District

Palnadu – Pension : పల్నాడు జిల్లాలో చిత్ర విచిత్రమైన ఘటన వెలుగుచూసింది. అక్కడ ప్రేతాత్మకు పెన్షన్ ఇస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 12ఏళ్లుగా ప్రేతాత్మకు పించన్ ఇస్తున్నారు. ప్రేతాత్మకు పెన్షన్ ఇవ్వడం ఏంటి? అని షాక్ అయ్యారు కదూ.

మ్యాటర్ ఏంటంటే.. 12ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికి ఇంకా వృద్దాప్య పెన్షన్ అందుతోంది. దీనికి కారణం చనిపోయిన వ్యక్తి కుమారుడే. తండ్రి చనిపోయినా విషయం బయటకు రానివ్వకుండా మ్యానేజ్ చేస్తూ పెన్షన్ డబ్బును సుపుత్రుడు మెక్కుతున్నాడు. 144 నెలల క్రితం చనిపోయిన తండ్రిని బతికి ఉన్నట్లుగా నమ్మిస్తూ ప్రతి నెల పెన్షన్ డబ్బులు తీసుకుంటూనే ఉన్నాడా ప్రబుద్ధుడు. చివరికి, వారి బంధువే ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రేతాత్మకు పెన్షన్ వ్యవహారం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

Also Read..Tirupati : పుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్.. అడ్డంగా దొరికిపోయిన స్మగ్లర్లు

క్రోసూరు మండలం దొడ్లేరుకు చెందిన కిరీటీ అనే వ్యక్తి 2001లో చనిపోయాడు. అప్పటికే అతడికి 70ఏళ్లు. వృద్దాప్యానికి తోడు అనారోగ్య సమస్యలతో అతడు మరణించాడు. సరిగ్గా పదేళ్ల తర్వాత 2011లో కిరిటీ చిన్న కొడుకు పారా శౌరయ్య కన్నింగ్ ఐడియా వేశాడు. నకిలీ డాక్యుమెంట్స్ తో తండ్రి పేరు మీద వృద్దాప్య పించన్ కు దరఖాస్తు చేశాడు. చనిపోయిన వ్యక్తి స్థానంలో బతికున్న మరో వ్యక్తిని అధికారులకు చూపించాడు. దీంతో అధికారులు కిరీటీ పేరు మీద వృద్దాప్య పెన్షన్ మంజూరు చేశారు.

అప్పటి నుంచి 12ఏళ్లుగా నెలకు దాదాపు రూ.3వేలు పెన్షన్ డబ్బులను కిరిటీ కుమారుడు తీసుకుంటున్నాడు. అలా 12ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యానేజ్ చేశాడు. చనిపోయిన తండ్రి పేరు మీద వచ్చే పెన్షన్ డబ్బుతో అతడు ఎంజాయ్ చేశాడు. అయితే, కిరిటీ బంధువులకు ఈ విషయం తెలియడంతో వెంటనే వారు కలెక్టరేట్ లో ఫిర్యాదు చేశారు. దాంతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తికి పెన్షన్ ఇస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది.

Also Read..Hyderabad : హయత్‌నగర్ వృద్ధురాలి మర్డర్ కేసుని 24గంటల్లోనే ఛేదించిన పోలీసులు.. చంపింది ఎవరో, ఎందుకో తెలుసా

12ఏళ్లుగా 4లక్షల రూపాయల ప్రభుత్వ సొమ్మును అక్రమంగా కాజేశాడని శౌరయ్యపై జాయింట్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే దీనిపై దర్యాఫ్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు జేసీ శ్యామ్ ప్రసాద్. ఇప్పుడీ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.