దిశా చట్టం..రాష్ట్రపతి ఆమోదం తర్వాతే – సుచరిత

  • Published By: madhu ,Published On : December 14, 2019 / 01:00 PM IST
దిశా చట్టం..రాష్ట్రపతి ఆమోదం తర్వాతే – సుచరిత

దిశా చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై రాష్ట్ర హోం మంత్రి సుచరిత క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రపతి ఆమోదం తర్వాతే..అమల్లోకి వస్తుందని తెలిపారు. గుంటూరు జిల్లాలో జరిగిన చిన్నారి ఘటనపై సత్వర న్యాయం చేస్తామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడికి త్వరగా శిక్ష పడేలా చేస్తామన్నారు. 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం గుంటూరు జిల్లాలో ఆమె మీడియాతో మాట్లాడారు.

ఆయేషా హత్యాచారం కేసులో గతంలో న్యాయం జరగలేదని, నిందితులను గుర్తించలేకపోయారన్నారు. తమ ప్రభుత్వంలో తప్పక న్యాయం జరుగుతుందనే హామీనిచ్చారు. ఆయేషా తల్లిదండ్రులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. CBIకి పోలీసు అధికారులు పూర్తిగా సహకరిస్తారని తెలిపారు. 2019, డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం అసెంబ్లీలో హోం మినిస్టర్ సుచరిత ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సభను దీనిని ఆమోదించింది.

గుంటూరులోని రామిరెడ్డి నగర్‌లో ఐదేళ్ల చిన్నారిపై ఇంటర్ విద్యార్థి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. 
చికిత్స నిమిత్తం చిన్నారిని జీజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తున్నారు. 

మరోవైపు ఆయేషా మీరా హత్యాచారం కేసులో పోలీసులు.. మహిళా కోర్టుకు అందించిన ఆధారాల్లో చూపిన డీఎన్‌ఏ నిజంగా ఆమెదేనా అనే సందేహం రావటంతో సీబీఐ అధికారులు రీపోస్టుమార్టం కోసం కోర్టును ఆశ్రయించారు. 
ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో 2007 డిసెంబర్ 27న ఆయేషా మీరా దారుణ హత్యకు గురైంది. అత్యాచారం చేసి ఆమెను చంపేశారు. 
దీనిపై విచారణ జరిపిన విజయవాడ 4వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రీ- పోస్టుమార్టం చేశారు.
ఆయేషా మీరాకు న్యాయం జరగాలని దేశంలోని మహిళలంతా ఎదురుచూస్తున్నారని తల్లి శంషాద్ బేగం అన్నారు. 
Read More : ఏపీకి వేల కోట్ల రూపాయలు తెస్తా : వర్మ సినిమా ఫ్లాప్..పిచ్చి సినిమా – పాల్