దిశా కేసు : హ్యాట్సాఫ్ సీపీ సజ్జనార్ – ఆయేషా మీరా తల్లి

  • Published By: madhu ,Published On : December 6, 2019 / 05:22 AM IST
దిశా కేసు : హ్యాట్సాఫ్ సీపీ సజ్జనార్ – ఆయేషా మీరా తల్లి

దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై అయేషా మీరా తల్లి హర్షం వ్యక్తం చేసింది. సీపీ సజ్జనార్‌కు హ్యాట్సాఫ్ చెప్పారు. ఆయేషా కేసులో రాజకీయ నేతల జోక్యంతో తమకు న్యాయం జరగలేదన్నారు. మహిళలుపై అత్యాచారాలు ఆగేలా ప్రత్యేక చట్టాలు తేవాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. పోలీసు, న్యాయస్థానాలకు స్వయంప్రతిపత్తిని కల్పించాలన్నారు. 
కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గ లేడీస్ హాస్టల్‌లో 2007 డిసెంబర్ 27 న బి ఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా హత్యకు గురైంది. 

2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం షాద్ నగర్‌ చటాన్ పల్లి వద్ద నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఘటనాస్థలంలో నిందితులను (మహ్మద్‌, జొల్లు శివ, చెన్నకేశవులు, నవీన్ కుమార్‌)లను విచారిస్తుండగా పోలీసులపై నిందితులు దాడికి యత్నించారు. పోలీసులపైకి ముందుగా ఆరిఫ్ దాడికి యత్నించారు. జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులు‌లు పోలీసులపైకి తిరగబడ్డారు. ఆయుధాలు లాక్కొనే ప్రయత్నం చేశారు. వీలు కాకపోవడంతో పోలీసులపై నిందితులు రాళ్లతో దాడి చేశారు. దాడి చేసి పారిపోతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో వారు చనిపోయారు. 

ఆయేషా కేసు విషయానికి వస్తే…
* కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని శ్రీదుర్గ లేడీస్ హాస్టల్‌లో 2007 డిసెంబర్ 27 న బి ఫార్మసీ విద్యార్ధిని ఆయేషా మీరా హత్యకు గురైంది. 
* ఈ కేసు అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
* కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. 
* కేసును విచారించిన పోలీసులు.. సత్యంబాబును అదుపులోకి తీసుకున్నారు. అతనే ప్రధాన నిందితుడని చెప్పారు. 
* 2010లో విజయవాడ కోర్టు తీర్పు ఇచ్చింది. సత్యంబాబును దోషిగా తేల్చింది. 
* అయితే..ఉన్నత న్యాయస్థానం 2016లో సత్యంబాబును నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. 
* ఆయేషా మీరా హత్య కేసును మళ్లీ విచారణ చేయాలంటూ సీబీఐకి హైకోర్టు ఆదేశించింది. 
* విజయవాడ కోర్టు కస్టడీలో ఉన్న ఆయేషా మీరా కేసు ఆధారాలను నాశనం చేశారంటూ ఆయేషా మీరా తల్లి హైకోర్టుకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు
* సత్యంబాబును మరోసారి విచారించారు సీబీఐ అధికారులు. 
* 12 ఏళ్ల తర్వాత 2019 జులై నెలలో ఆయేషా మీరా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని సీబీఐ భావించింది. 
* తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దిశా ఘటనతో ఎలాంటి పరిణామాలు చోటు చేసకుంటాయో చూడాలి. 
Read More : విన్నపాలు వినవలె : సీఎం జగన్ ఢిల్లీ టూర్