పెళ్లి చేసుకోమంటే.. కారులో రేప్ చేసి flyover కింద కాల్చేశాడు

పెళ్లి చేసుకోమంటే.. కారులో రేప్ చేసి flyover కింద కాల్చేశాడు

దిశ ఘటన జరిగిన కొద్ది రోజులకే హైదరాబాద్‌లో మరో ఘోరం జరిగింది. తంగడపల్లి పరిధిలో జరిగిన ఈ ఘటనపై కేసు విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. ప్రేమించిన వాడ్ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకొచ్చినందుకే ఆ మహిళను హత్య చేసినట్లు సైబరాబాద్‌ పోలీసులు ప్రాథమిక నిర్ధారణకొచ్చారు. కారులో ఒకరి తర్వాత మరొకరు అత్యాచారం చేసి గొంతు నులిమి చంపినట్లు గుర్తించారు. 

రంగారెడ్డి చేవెళ్ల మండలం తంగడపల్లి పై వంతెన కింద మార్చి 17న ఓ గుర్తు తెలియని మహిళ దారుణ హత్యకు గురైంది. ప్రాథమిక విచారణలో ఇద్దరు యువకులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా సైబరాబాద్‌ పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరిని రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. మృతురాలు వివాహానికి ముందే పరారీలో ఉన్న నిందితుడితో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. 

పెళ్లి తర్వాత కూడా సన్నిహితంగా ఉండటమే ఈ నేరానికి కారణమైంది. పెళ్లైతే జరిగిందని ఆమె ఆ వివాహ బంధాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్లి కొత్త జీవితాన్ని మొదలుపెడదామంటూ ప్రియుడిపై ఒత్తిడి తెచ్చింది. ఆ వ్యక్తి మరో అమ్మాయితో రిలేషన్లో ఉండటంతో వివాహితను దూరంగా పెట్టాడు. ఆమెలో మార్పు కనిపించకపోవడంతో ఎలాగైనా వదిలించుకోవాలనే ఉద్దేశంతో హత్య చేసినట్లు తెలుస్తోంది. 

పథకం ప్రకారంగా.. లాంగ్ డ్రైవ్ అని చెప్పి:
ఇద్దరు వ్యక్తులు కలిసి లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్దామంటూ మహిళను నమ్మించి కారులో ఎక్కించుకున్నారు. ప్రియుడు బలవంతంగా ఆమెపై అత్యాచారం జరిపాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత మరొక వ్యక్తి బలాత్కారం చేశాడు. మట్టుబెట్టాలనే ఉద్దేశ్యంతో గొంతు నులిమి హత్య చేశారు. మహిళ దుస్తులు తీసేసి మృతదేహాన్ని ఫ్లై ఓవర్ కిందకు తెచ్చారు. గంట పాటు అక్కడే ఉండి తలను ఛిద్రం చేశారు.

సాక్ష్యం బయటపడకూడదని బండరాయిని తమ వెంట తీసుకుపోయారు. అద్దెకు తీసుకున్న కారులో ఈ ఘాతుకానికి పాల్పడటంతో కారు జీపీఎస్‌ వారిని పట్టించింది. అక్కడి నుంచి ఎన్కేపల్లి, ప్రగతి రిసార్ట్స్‌, ప్రొద్దుటూరు మీదుగా నార్సింగ్ ఇంటర్‌ఛేంజ్‌ నుంచి ఓఆర్‌ఆర్‌పైకి చేరారు. ప్రొద్దుటూరు దగ్గర లభించిన సీసీ ఫుటేజీ ద్వారా నేరస్థులను గుర్తించారు పోలీసులు. 

దొరికిన నిందితుడి ద్వారా సగం వివరాలు తెలియగా.. పరారీలో ఉన్న నిందితుడు దొరికితే మృతురాలికి సంబంధించిన వ్యక్తిగత వివరాలు, ఇతర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఈ ఘటనలో కీలకమైన మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు ముంబై పలు ప్రాంతాల్లో గాలింపు చేపడుతున్నాయి. 

See Also | ఏపీలో హై అలర్ట్ : సీఎం జగన్ ఆదేశాలు..ఆ ఇళ్లకు రాకపోకలు బంద్