Anandaiah’s Medicine: ఇంటికే ఆనందయ్య మందు.. చంద్రగిరిలో పంపిణీకి ఏర్పాట్లు!

ఆనందయ్య మందు ఎట్టకేలకు ప్రజల వద్దకు చేరింది. ప్రభుత్వం, కోర్టు నుంచి అనుమతులు రావడంతో వేగంగా పంపిణీకి ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఆనందయ్య K మందు పంపిణీకి కూడా ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. K మందు పంపిణీ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంటికే ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నారు.

Anandaiah’s Medicine: ఇంటికే ఆనందయ్య మందు.. చంద్రగిరిలో పంపిణీకి ఏర్పాట్లు!

Anandaiah Medicine

Anandaiah’s Medicine: ఆనందయ్య మందు ఎట్టకేలకు ప్రజల వద్దకు చేరింది. ప్రభుత్వం, కోర్టు నుంచి అనుమతులు రావడంతో వేగంగా పంపిణీకి ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఆనందయ్య K మందు పంపిణీకి కూడా ఏపీ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. K మందు పంపిణీ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంటికే ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌లో ఆనందయ్య మందు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టనుంది.

నేటి నుంచి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఆనందయ్య మందు పంపిణీ జరగనుంది. నిన్న చంద్రగిరిలో ఆనందయ్య మందును ఎమ్మెల్యే చెవిరెడ్డి 20మందికి అందించగా.. నియోజకవర్గంలోని లక్షా 50 వేల కుటుంబాలకు మందు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆనందయ్య కుమారుడు శ్రీధర్‌, ఇతర శిష్యుల ఆధ్వర్యంలో మందు తయారవుతోంది. చంద్రగిరి నియోజకవర్గంలో ఇంటింటికి మందు పంపిణీ చేస్తామని ఇప్పటికే వెల్లడించారు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.

సర్వేపల్లి నియోజకవర్గంలోని గొలగమూడి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి గుడి వద్ద మందు పంపిణీని ప్రారంభించారు. వైసీపీ ఎమ్మెల్యే కాకాణి. కరోనా సోకిన వారికి ఎరుపు రంగు కవర్‌లో.. కరోనా సోకకుండా ఉండే ప్రివెంటివ్‌ మందును బ్లూ కలర్‌ కవర్‌లో పంపిణీ చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని లక్షా 80 వేల కుటుంబాలకు మందు పంపిణీ చేస్తామని కాకాణి తెలిపారు.మూడు లక్షల మందికి మందు పంపిణీ చేస్తామని అంటున్నారు నిర్వాహకులు.

ఆనందయ్య మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావాల్సిన పనిలేదని, సర్వేపల్లిలో పంపిణీ పూర్తయ్యాకే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు పంపిణీ చేస్తామమని చెబుతున్నారు నిర్వాహకులు.