Andhra Pradesh Coronavirus : తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక కరోనా కేసులు నమోదు

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో 2,567 మందికి కరోనా సోకింది. 18 మంది మృతిచెందినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Andhra Pradesh Coronavirus : తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక కరోనా కేసులు నమోదు

Andhra Pradesh Coronavirus (7)

Andhra Pradesh Coronavirus : ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో 2,567 మందికి కరోనా సోకింది. 18 మంది మృతిచెందినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

ఏపీలో ప్రస్తుతం 26 వేల 710 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 13 వేల 342 మంది మృతి చెందారు. మంగళవారం అత్యధికంగా గుంటూరు జిల్లాలో 4గురు మరణించారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 356 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన 19,26,988 పాజిటివ్ కేసులకు గాను 18,87,236 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :

గుంటూరు జిల్లాలో నలుగురు, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, నెల్లూరు ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, ప్రకాశం ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, విశాఖ ఒక్కరు, విజయనగరంలో ఒకరు మృతి చెందారు.

జిల్లాల వారీగా కేసులు :

అనంతపురం 81. చిత్తూరు 300. ఈస్ట్ గోదావరి 356. గుంటూరు 269. వైఎస్ఆర్ కడప 75. కృష్ణా 269. కర్నూలు 18. నెల్లూరు 244, ప్రకాశం 351, శ్రీకాకుళం 77, విశాఖపట్టణం 199, విజయనగరం 49, వెస్ట్ గోదావరి 279. మొత్తం : 2,567

 

Image