సీఎం జగన్ ను కలవనున్న దివ్య తేజస్విని పేరెంట్స్

  • Published By: madhu ,Published On : October 20, 2020 / 10:05 AM IST
సీఎం జగన్ ను కలవనున్న దివ్య తేజస్విని పేరెంట్స్

Divya Tejaswini Parents to meet CM Jagan : దారుణ హత్యకు గురైన దివ్య తేజస్విని పేరెంట్స్ సీఎం జగన్ ను కలువనున్నారు. తమకు న్యాయం చేయాలని వారు కోరనున్నారు. ఇటీవలే నాగేంద్ర చేతిలో దివ్య దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.



నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో..రెండు రోజుల క్రితం రాష్ట్ర హోం మంత్రి సుచిరిత..దివ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. తాము సీఎంను కలువాలని అనుకుంటున్నట్లు కోరారు. దీంతో సీఎంను కలిసేందుకు మంత్రి ప్రత్యేక చొరవ చూపారు. ఈ నేపథ్యంలో 2020, అక్టోబర్ 20వ తేదీ బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో వారు సీఎం జగను కలువనున్నారు.
https://10tv.in/another-shocking-twist-in-vijayawada-divya-tejaswini-murder-case/
విజయవాడలో బీటెక్ చదువుతున్న దివ్య తేజస్విని నాగేంద్ర దారుణంగా కత్తితో పొడిచాడు. అనంతరం తాను గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం ఇతను జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు. తాము పెళ్లి చేసుకున్నామని, పెద్దలు అంగీకరించకపోవడంతో తాము ఆత్మహత్య చేసుకున్నామని నాగేంద్ర వెల్లడించాడు.



ఇందుకు సంబంధించిన ఓ ఫోటో నెట్టింట్లో వైరల్ అయ్యింది. వీటిని దివ్య తల్లిదండ్రులు కొట్టిపారేస్తున్నారు. అసలు పెళ్లే కాలేదని, ఇద్దరు ఆత్మహత్యకు యత్నిస్తే..దివ్య శరీరంలో 13 కత్తిపోట్లు ఎలా ఉన్నాయంటూ ప్రశ్నిస్తున్నారు. అతడికి ఉరిశిక్ష వేయాలి, లేదా ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు.

దర్యాప్తు చేస్తున్న క్రమంలో దివ్య సెల్ఫీ వీడియోలు ప్రకంపనలు సృష్టించాయి. ఆమె తీసిన సెల్పీ వీడియోలో చెప్పిన వ్యక్తి ఎవరు ? అనే కోణంలో కూడా దర్యాప్తు చేయనున్నారు. దివ్య ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో చివరి సారిగా మాట్లాడిన ఓ వీడియో..కీలకంగా మారింది. తాను ఓ సైకోతో పోరాడుతున్నానని…అతను తన జీవితం నాశనం చేయాలని చూశాడని ఆ వీడియోలో చెప్పుకుంది.



తాను చాలా స్ట్రాంగ్‌గా ఉన్నానని…పోరాడాలని అనుకుంటున్నానని కంటతడి పెట్టింది. అలాగే తనకు బెదిరింపు కాల్స్‌, మెసేజ్‌లు వస్తున్నాయంటూ..ఓ మహిళ వల్ల తాను మోసపోయానంటూ బాధపడింది. దూరం పెట్టడంతో నాగేంద్ర కోపం పెంచుకున్నాడని, ఆమె స్నేహితుల సహాయంతో నాగేంద్ర వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు.

ప్రస్తుతం దివ్య ఫోన్ ను సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారు. స్నేహితులకు ఫేస్ బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్ లను దివ్య యాక్సిస్ ఇచ్చినట్లు తేలింది. స్నేహితులను ప్రశ్నించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ కేసును దిశ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు.



దివ్య అంత్యక్రియలు జరిగిన ప్రాంతానికి దిశ స్పెషల్ విభాగం ఆఫీసర్ దీపికా పాటిల్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ కేసును మాచవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో దివ్య పేరెంట్స్ …సీఎం జగన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.