దివ్యకి పెళ్లైందా..లేదా? వాట్సప్ మేసేజ్‌ల బిగ్ ట్విస్ట్

  • Published By: Suresh Kumar ,Published On : October 17, 2020 / 07:38 PM IST
దివ్యకి పెళ్లైందా..లేదా? వాట్సప్ మేసేజ్‌ల బిగ్ ట్విస్ట్

vijayawada Divya Tejaswini Murder Case: ముందే కంప్లైంట్ ఇస్తే..ఇంత దారుణం జరిగేది కాదా? సమస్యని తానే పరిష్కరించుకుంటానంటూ దివ్య చెప్పిందా? ఈ సందేహాలే ఇప్పుడు ఎక్కువగా విన్పిస్తున్నాయ్. దివ్య తండ్రి జోసెఫ్‌ని ఈ విషయమై ప్రశ్నిస్తే ఓ వ్యక్తి తనని ఇబ్బంది పెడుతున్నట్లు మాత్రమే చెప్పిందన్నారాయన.

దివ్య సోదరుడు దినేశ్ స్పందనకూడా ఇదే. తనంతట తాను ఈ సమస్యని పరిష్కరించుకోగలనని
ఇన్‌స్టాగ్రామ్ వీడియోలోనూ ఉందని గుర్తు చేశారు దినేశ్.



ఇదే సమయంలో అసలు దివ్యకి నాగేంద్రకి పెళ్లి అయిందనే విషయాన్ని ఒప్పుకోవడంలేదు దివ్య కుటుంబసభ్యులు. జూన్‌లో నాగేంద్ర తనకి ఫోన్ చేసిన సందర్భంలోనే, దివ్యని ఇబ్బంది పెడుతున్న వ్యక్తి నాగేంద్రే అని తెలిసిందంటారాయన.అంతేకాదు, కేసు నుంచి తప్పించుకునేందుకే దివ్యతో కలిసి ఉన్నట్లుగా వీడియోలన్నీ రిలీజ్ చేసినట్లు ఆరోపిస్తున్నారు దివ్య తండ్రి.

మరోవైపు పోలీసులు మాత్రం 2018లో మార్చిలో మంగళగిరి పానకాలస్వామి గుడికి దివ్య నాగేంద్ర వెళ్లినట్లు నిర్ధారించారు.పెళ్లైందో లేదో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీనికోసం పోలీసులు వాట్సాప్ ఫేస్‌బుక్ మెసేజ్‌లను వెలికితీసే పనిలో పడ్డారు. ఈ మార్చి 28న నాగేంద్రకి దివ్య ఫోన్ చేయగా, ఏప్రిల్ 2న దివ్యకు నాగేంద్ర నుంచి ఫోన్‌కాల్ వచ్చిందని గుర్తించారు.



మొదటి ఫోన్‌కాల్స్‌లో పెళ్లి విషయం దాచలేక ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పగా, తాజా వీడియోలో మాత్రం నాగేంద్రపై ఆగ్రహం కన్పిస్తోంది. మరి ప్రేమ పెళ్లి కాస్తా ఎందుకు మర్డర్ వరకు వెళ్లిందన్ననే ప్రశ్న.

పోలీసులు, దివ్య తన వీడియోలో చెప్పినదాని ప్రకారం చూస్తే..ఈ ఏడాది లాక్‌డౌన్ విధించే వరకూ దివ్య,నాగేంద్ర టచ్‌లోనే ఉన్నారు. అలానే దివ్య నాగేంద్రలోని సైకో కోణాన్ని కూడా ఇక్కడే గమనించి అతన్ని బ్లాక్ చేసింది. ఇది తట్టుకోలేకే నాగేంద్ర దివ్యని వేధించడం మొదలుపెట్టాడని అర్ధమవుతోంది.

ఇదే విషయాన్ని దివ్య తేజస్విని తన వీడియోలో కూడా చెప్పడం గమనించవచ్చు. ఐతే ఇంత తెలిసిన దివ్య ఏ ఒక్కసారైనా, తన తల్లిదండ్రులకో, సోదరుడుకో ప్రాణహాని ఉందనే విషయాన్ని చెప్పి ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదేమో అనే ఆవేదన కలగకమానదు.



ప్రస్తుతం ఈ కేసు విజయవాడ పిఎస్ నుంచి దిశా స్టేషన్‌కి బదిలీ అయింది. ఏపీ హోంమంత్రి సుచరిత వ్యకుటుంబసభ్యులను పరామర్శించారు..కేసులో దోషులకు కఠిన చర్యలు తీసుకుంటామంటూ భరోసా ఇచ్చారు.

కేసులో మరో కీలక మలుపు కూడా తొందర్లోనే వెలుగులోకి రానుంది..దివ్య,నాగేంద్రకు మధ్య ఓ యువతి సాయం చేసిందని, ఆ యువతి ద్వారానే దివ్య ఫోన్ నంబర్లు నాగేంద్రకి అందాయంటున్నారు. ఇంతకీ ఎవరా మహిళ అనే దిశగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దివ్య సోదరుడు దినేశ్ కూడా ఈ విషయంపై స్పందించారు



ఇదంతా ఓ వైపు విన్పిస్తోన్న వెర్షన్ మాత్రమే. నాగేంద్ర మాత్రం తమ పరిచయం 13ఏళ్లనాటిదంటూ చెప్పుకొస్తున్నాడు. తమని విడదీసేందుకే దివ్యతల్లిదండ్రులు ప్రయత్నించారని, అది తట్టుకోలేకే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు చెప్పాడు. అంతేకాదు చనిపోవాలనుకుని ఇద్దరం అనుకున్నామంటూ మరో వెర్షన్ కూడా విన్పించాడు.

ఏది వాస్తవమనేది వెంటనే తేలకపోయినా 22ఏళ్లకే దివ్య చనిపోవడం మాత్రం కళ్ల ముందు కన్పిస్తున్న నిజం. అంతే కాదు, ప్రేమ ఉన్మాదంగా మారితే ఎలా ఉఁటుందనేదానికి నాగేంద్రే నిదర్శనం.