Ayesha Mira: న్యాయం చెయ్యండి.. న్యాయమూర్తికి ఆయేషా తల్లిదండ్రుల లేఖ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంరేపిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు

Ayesha Mira: న్యాయం చెయ్యండి.. న్యాయమూర్తికి ఆయేషా తల్లిదండ్రుల లేఖ

Cji

Ayesha Mira: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంరేపిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సత్యంబాబు నిర్దోషిగా విడుదలైన తర్వాత.. ఆ కేసులో ఇప్పటికీ న్యాయం జరగలేదంటూ ఆయేషా మీరా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తన సొంత రాష్ట్ర పర్యటనలో ఉన్న సీజేఐ ఎన్వీ రమణకు ఆయేషా మీరా తల్లిదండ్రులు లేఖ రాశారు. ఆయేషా మీరా కేసులో న్యాయాన్ని కాపాడాలని కోరారు.

ప్రజాస్వామ్య దేశంలో ఓ హత్య కేసులో 14 ఏళ్లైనా న్యాయం దక్కడం లేదని, న్యాయం చేయాలని సీజేఐ ఎన్వీ రమణకి ఆయేషా తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే ఈకేసులో నిందితుడిగా అరెస్ట్ అయిన సత్యంబాబును 8ఏళ్ల జైలు తర్వాత హైదరాబాదు హైకోర్టు నిర్దోషిగా ప్రకటించినది. అంతేకాదు.. ఈ కేసులో తనకు న్యాయం జరగలేదంటూ జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కూడా సత్యంబాబు ఆశ్రయించారు.

27 డిసెంబరు 2007న విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో శ్రీదుర్గా లేడీస్ హాస్టల్‌లో ఉంటూ, నిమ్రా కాలేజీలో ఫార్మసీ కోర్సు చేస్తున్న 19 ఏళ్ళ ఆయేషా మీరాపై హత్యాచారం జరిగింది.

.స్నానాల గదిలో ఆయేషాను కృరంగా చంపి పడేశారు. స్నానపుగదిలో కత్తిపోట్లతో నెత్తురోడిన ఆయేషా నగ్న మృతదేహం వద్ద తన ప్రేమను కాదన్నందుకే ఆయేషాకి ఈ గతి పట్టించానంటూ అప్పట్లో హంతకుడు ఓ లేఖను కూడా వదిలి వెళ్లాడు.