కరోనా వేళ : ఫీజులు పెంచొద్దు..ఇన్ స్టాల్ మెంట్ పద్ధతిలో ఫీజులు..జగన్ సంచలన నిర్ణయం

  • Published By: Mahesh ,Published On : April 23, 2020 / 05:09 PM IST
కరోనా వేళ : ఫీజులు పెంచొద్దు..ఇన్ స్టాల్ మెంట్ పద్ధతిలో ఫీజులు..జగన్ సంచలన నిర్ణయం

కరోనా రాకాసి వల్ల లాక్ డౌన్ కావడంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకొంటోంది. లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు, కాలేజీలకు తాళాలు పడ్డాయి. ఫీజులు కట్టాలంటూ కొన్ని యాజమాన్యాలు తల్లిదండ్రులపై వత్తిడి తెస్తున్నారని తెలిసింది. దీనితో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫీజులు పెంచవద్దని..వాయిదా పద్ధతిలో ఫీజులు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు 2020, ఏప్రిల్ 23వ తేదీ గురువారం రాష్ట్ర ప్రాథమిక విద్య కమిషన్ ఛైర్మన్ జస్టిస్ కాంతారావు పలు ఆదేశాలు జారీ చేశారు. 

లాక్ డౌన్ సమయంలో కూడా ఫీజులు కట్టాలని తల్లిదండ్రులపై వత్తిడి తేవొద్దని యాజమాన్యాలకు సూచించారు. పాఠశాలలు, జూ.కాలేజీల్లో గత సంవత్సరం నిర్ణయించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలని సూచించారు. ఇక్కడ మొదటి త్రైమాసిక కాలం ఫీజును మాత్రమే వసూలు చేయాలని సూచించారు. ఈ ఫీజును రెండు వాయిదా పద్ధతిలో వసూలు చేసే విధంగా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా వ్యవహరిస్తే..కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. దీనివల్ల ఎంతో మంది పేదలకు లాభం కలుగనుంది. 

ప్రస్తుతం కరోనా వైరస్ ఏపీలో విజృంభిస్తోంది. లాక్‌డౌన్ విధించడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఇళ్లకే పరిమితం కావడంతో చాలామందికి ఉపాధి దెబ్బతిన్నది. దీనివల్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వం భావించింది. చివరకు తల్లిదండ్రుల వినతి మేరకు స్కూళ్లు, కాలేజీల ఫీజులను చెల్లించేందుకు ఇన్‌స్టాల్మెంట్స్ సదుపాయం కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.