పిచ్చివాడిగా ముద్ర వేసి చంపాలనుకున్నారు, పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైన డాక్టర్ సుధాకర్

విశాఖ డాక్టర్ సుధాకర్ వ్యవహారం ఏపీలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సడెన్ గా డాక్టర్ సుధాకర్ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో

  • Published By: naveen ,Published On : June 11, 2020 / 07:10 AM IST
పిచ్చివాడిగా ముద్ర వేసి చంపాలనుకున్నారు, పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైన డాక్టర్ సుధాకర్

విశాఖ డాక్టర్ సుధాకర్ వ్యవహారం ఏపీలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సడెన్ గా డాక్టర్ సుధాకర్ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో

విశాఖ జిల్లా నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ వ్యవహారం ఏపీతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సడెన్‌గా డాక్టర్ సుధాకర్ విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షం అయ్యారు. గురువారం(జూన్ 11,2020) ఆయన ఫోర్ట్ టౌన్ పీఎస్ వెళ్లారు. తన కారు, వస్తువులు తిరిగి ఇవ్వాలని పోలీసులను కోరారు. మే 16వ తేదీన తనపై 30మంది దాడి చేశారని డాక్టర్ సుధాకర్ చెప్పారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడున్నానంటూ తనను కొట్టారని చెప్పారు. ఆ రోజు నేను మద్యం తాగలేదన్నారు. తనకు పిచ్చి లేదని తేల్చి చెప్పారు. తన మాటలు విని సీబీఐ కూడా తనకు పిచ్చి లేదని చెప్పిందని డాక్టర్ సుధాకర్ చెప్పారు. మానసిక వైద్యశాలలో డాక్టర్లు తనను హింసించారని డాక్టర్ సుధాకర్ వాపోయారు. మానసిక వైద్యశాలపై సీబీఐ విచారణ వేయాలని డిమాండ్ చేశారు. తనపై పిచ్చివాడిగా ముద్ర వేసి చంపాలనుకున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ అంటే తనకు చాలా ఇష్టం అన్న డాక్టర్ సుధాకర్, వైఎస్ఆర్ పాదయాత్రలో కూడా పాల్గొన్నట్టు వెల్లడించారు.

ఎమ్మెల్యేతో విభేదాలు లేవు, వైఎస్ఆర్ అంటే అభిమానం:
స్థానిక ఎమ్మెల్యే గణేష్ ఆయన అన్న పూరి జగన్నాథ్ అంటే తనకు చాలా ఇష్టం అన్నారు డాక్టర్ సుధాకర్. ఎమ్మెల్యేతో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. మాస్కుల గురించి ఎమ్మెల్యేను కలుద్దామని వెళ్లానని, ఆయన లేకపోవడంతోనే టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి దగ్గరికి వెళ్లానని డాక్టర్ సుధాకర్ వివరించారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవన్నారాయన. తనకు మళ్లీ ఉద్యోగం వస్తుందని అనుకోవడం లేదన్నారు. ఒకవేళ ఉద్యోగం వస్తే మంచి డాక్టర్ గా పని చేస్తానన్నారు. తన మీద కుట్ర జరుగుతోందని డాక్టర్ సుధాకర్ ఆరోపించారు.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన డాక్టర్ సుధాకర్ కేసు:
విశాఖ డాక్టర్ సుధాకర్ ఘటన ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతుండగా.. ఆయన ఇటీవలే మానసిక వైద్యశాల నుంచి విడుదలయ్యారు. అయితే, హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మానసిక ప్రశాంతత కోసం విశాఖపట్నంలోనే ఓ రహస్య ప్రదేశంలో సుధాకర్ విశ్రాంతి తీసుకుంటున్నారని ఆయన సన్నిహితులు వెల్లడించారు. 

సుధాకర్ తల్లి కావేరిబాయి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేయడంతో ఆయనను డిశ్చార్జ్ చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సుధాకర్‌ను అక్రమంగా కస్టడీలోకి తీసుకున్నారని.. 24 గంటల్లో డాక్టర్ ఆయనను కోర్టులో ప్రవేశపెట్టాలంటూ ఆమె తన పిటిషన్‌‌లో కోరారు. అయితే డాక్టర్ సుధాకర్‌ను తాము అరెస్ట్ చేయలేదని పోలీసులు వెల్లడించడంతో ఆయనను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయమని ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.

అర్థనగ్నంగా నడిరోడ్డుపై అరెస్ట్:
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో అనస్థీషియనిస్టుగా పని చేసిన డాక్టర్ సుధాకర్ కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని, డాక్టర్లకు కూడా మాస్కులు ఇవ్వడంలేదని తీవ్ర విమర్శలు చేయడంతో సస్పెండ్ కావడం, ఆ తర్వాత విశాఖపట్నంలో సడెన్ గా ప్రత్యక్షమై, అర్థనగ్నంగా రోడ్డుపైనే అరెస్టు కావడం, దానిపై ఏపీ హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం తెలిసిందే. ఎన్నో మలుపుల తర్వాత వైజాగ్ మెంటల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సుధాకర్.. శనివారం(జూన్ 6,2020) అర్ధరాత్రి తర్వాత ఎవరికీ కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

విచారణ చేస్తున్న సీబీఐ:
ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారాన్ని చేపట్టిన సీబీఐ.. దర్యాప్తులో వేగం పెంచింది. సస్పెన్షన్ వేటు పడకముందు సుధాకర్ పనిచేసిన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి వెళ్లి.. అక్కడి సర్వీసు రికార్డు, అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలనతోపాటు సిబ్బంది ద్వారా కొన్ని కీలక వివరాలను సీబీఐ సేకరించింది. తోటివారే తనను మోసం చేశారని, రెచ్చగొట్టి మాట్లాడించి, వీడియో రికార్డు చేశారని సుధాకర్.. జడ్జికి ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపిన నేపథ్యంలోనే సీబీఐ అధికారులు నర్సీపట్నంలో పర్యటించినట్లు తెలుస్తోంది.

దళితుడు కాబట్టే వేధిస్తున్నారని టీడీపీ ఆరోపణ:
డాక్టర్ సుధాకర్ అరెస్టు వ్యవహారంలో అనుచితంగా ప్రవర్తించారంటూ వైజాగ్ పోలీసులపై దాఖలైన కేసును సీబీఐ విచారిస్తోంది. కాగా, అసలు సుధాకర్ ను మెంటల్ ఆస్పత్రిలో ఎవరు చేర్పించారన్న విషయమై ఇంతవరకూ స్పష్టత రాకపోవడం గమనార్హం. ఆయనే వచ్చి చేరారని మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రాధారాణి చెబుతుండగా, కాదూ పోలీసులే ఆయనను తరలించారని కేజీహెచ్ అధికారులు అంటున్నారు. దీనిపైనా సీబీఐ మరింత లోతుగా విచారిస్తోంది. సుధాకర్ సస్పెన్షన్, అరెస్టు వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. బాధిత డాక్టర్ దళితుడు కాబట్టే వైసీపీ సర్కార్ వేధింపులకు గురి చేస్తోందని టీడీపీ ఆరోపించింది. 

Read: విశాఖలో పబ్జీ గేమ్ ఆడి పిచ్చోడయ్యాడు